Shakib Al Hasan: క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన షకీబ్ అల్ హసన్.. ఆ మ్యాచే లాస్ట్!

Shakib Al Hasan Announces Retirement: బంగ్లాదేశ్ స్టార్ ఆల్​రౌండర్ షకీబ్ అల్ హసన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కాన్పూర్ టెస్ట్​కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్​లో అతడు ఈ అనౌన్స్​మెంట్ చేశాడు.

Shakib Al Hasan Announces Retirement: బంగ్లాదేశ్ స్టార్ ఆల్​రౌండర్ షకీబ్ అల్ హసన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కాన్పూర్ టెస్ట్​కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్​లో అతడు ఈ అనౌన్స్​మెంట్ చేశాడు.

క్రికెట్​కు బంగ్లాదేశ్ అందించిన ఫైనెస్ట్ ప్లేయర్స్​లో ఒకడు షకీబ్ అల్ హసన్. బ్యాటర్​గా, స్పిన్నర్​గా బంగ్లా టీమ్​కు ఎన్నో సేవలు అందించాడతను. దశాబ్దంన్నరకు పైగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న షకీబ్ మోడర్న్ ఆల్​రౌండర్స్​లో తోపుగా పేరు తెచ్చుకున్నాడు. సింగిల్ హ్యాండ్​తో ఎన్నో మ్యాచుల్లో బంగ్లాను గెలిపించాడు. క్రికెట్​ ద్వారా వచ్చిన పాపులారిటీతో పాలిటిక్స్​లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడా సక్సెస్ అయ్యాడు. అలాంటోడు ఇవాళ తన రిటైర్మెంట్ గురించి కీలక ప్రకటన చేశాడు. టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు. ఆ మ్యాచే తనకు లాస్ట్ అని స్పష్టం చేశాడు. భారత్​తో జరగబోయే రెండో టెస్ట్​కు ముందు కాన్పూర్​లో నిర్వహించిన ప్రెస్​ కాన్ఫరెన్స్​లో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. షకీబ్ ఇంకా ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

టెస్ట్ క్రికెట్​ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యానని షకీబ్ అన్నాడు. అక్టోబర్ నెలలో సౌతాఫ్రికాతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ లాంగ్ ఫార్మాట్​లో తనకు చివరిదని తెలిపాడు. సొంతగడ్డపై టెస్టులకు వీడ్కోలు పలకాలనేది తన కోరిక అని చెప్పాడు. బంగ్లాదేశ్ క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని అందుకే సొంత అభిమానుల మధ్య టెస్టుల్లో చివరి మ్యాచ్ ఆడాలని భావిస్తున్నానని పేర్కొన్నాడు షకీబ్. టీ20ల్లో కొనసాగడం మీద కూడా అతడు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే తాను ఆఖరి టీ20 మ్యాచ్ ఆడేశానని అన్నాడు. పొట్టి ప్రపంచ కప్-2024తో తన టీ20 ఛాప్టర్ ముగిసిందన్నాడు. ఆ ఫార్మాట్​లో తనకు ఎంతో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయని వ్యాఖ్యానించాడు. అయితే బంగ్లా క్రికెట్​ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యంగ్​స్టర్స్ మీద ఉందన్నాడు. వాళ్లకు ఛాన్స్ ఇవ్వడం కోసమే ఆ ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటున్నానని క్లారిటీ ఇచ్చాడు షకీబ్.

ఇక, 17 ఏళ్ల లాంగ్ కెరీర్​లో 70 టెస్టులు ఆడిన షకీబ్.. 4600 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్​లో 242 వికెట్లు తీశాడీ స్పిన్నర్. వన్డేల్లో 247 మ్యాచుల్లో 7570 పరుగులు చేశాడు. 9 సెంచరీలు, 56 ఫిఫ్టీలు బాదాడు. అలాగే 317 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 129 మ్యాచుల్లో కలిపి 2551 పరుగులు చేసిన షకీబ్.. 149 వికెట్లతో హయ్యెస్ట్ వికెట్ టేకర్​గా ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియాతో టెస్ట్ సిరీస్​లో ఆడుతున్న ఈ ఆల్​రౌండర్ స్వదేశానికి వెళ్లేందుకు భయపడుతున్నాడు. ఆ మధ్య చెలరేగిన రాజకీయ సంక్షోభంలో షకీబ్ ఎంపీ పదవి కోల్పోయాడు. సొంత దేశానికి వెళ్లేందుకు తనకు ఎలాంటి సమస్య ఎదురు కాకపోవచ్చాన్నాడు. అయితే ఒక్కసారి బంగ్లాకు వెళ్తే తిరిగి బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. అక్కడికి వెళ్లాలా? వద్దా? అనేది ఇంకా డిసైడ్ కాలేదన్నాడు. మరి.. షకీబ్ రిటైర్మెంట్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments