SNP
Shah Rukh Khan, Sourav Ganguly: ఐపీఎల్ 2024లో తొలి సారి ఓ మ్యాచ్‌లో బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే.. ఈ మ్యాచ్‌ను మించిన సీన్ ఒకటి మ్యాచ్ తర్వాత చోటు చేసుకుంది. అది కూడా షారుఖ్, దాదా మధ్యలో. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Shah Rukh Khan, Sourav Ganguly: ఐపీఎల్ 2024లో తొలి సారి ఓ మ్యాచ్‌లో బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే.. ఈ మ్యాచ్‌ను మించిన సీన్ ఒకటి మ్యాచ్ తర్వాత చోటు చేసుకుంది. అది కూడా షారుఖ్, దాదా మధ్యలో. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఆడే మ్యాచ్‌లకు వచ్చి.. ఆ టీమ్‌ను ఒక రేంజ్‌లో ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు కేకేఆర్ కో ఓనర్ షారుఖ్ ఖాన్. తాజాగా కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌కు కూడా ఎస్‌ఆర్‌కే హాజరయ్యాడు. మ్యాచ్ తర్వాత గ్రౌండ్‌లో తిరుగుతూ.. ఆటగాళ్లను కలుస్తూ, స్టేడియానికి వచ్చి కేకేఆర్ టీమ్‌కు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న గంగూలీని చూసిన షారుఖ్ ఖాన్.. పరిగెత్తుకుంటూ వెళ్లి.. వెనుక నుంచి దాదాను కౌగిలించుకని, అతనికి ముద్దు కూడా పెట్టాడు. ఈ సీన్స్ అన్ని కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాదాను అంత అప్యాయంగా షారుఖ్ పలకరించడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు ఆరంభ సీజన్‌లో గంగూలీనే కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అలాగే 2010 సీజన్‌లో కూడా దాదానే కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, దాదా కెప్టెన్సీలో కేకేఆర్ టీమ్ పెద్దగా రాణించలేదు. కానీ, అప్పట్లోనే కేకేఆర్‌కు అంత స్టార్ డమ్ వచ్చిందంటే గంగూలీనే కారణం. అతన్ని ప్రిన్స్ ఆఫ్ కోల్‌కత్తా, బెంగాల్ టైగర్ అనే బిరుదులు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలను దాదాను ఆరాధ్య దైవంగా భావిస్తారు. టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో నుంచి దాదాకు బెంగాల్‌లో భారీ ఫాలోయింగ్. బెంగాల్‌కు చెందిన వ్యక్తి కాబట్టి దాదాను అక్కడి ప్రజలు విపరీతంగా అభిమానించే వారు. ఇప్పటికీ దాదాకు అక్కడ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే.. కేకేఆర్‌కు ఆడిన బాండింగ్‌తో పాటు, గంగూలీతో వ్యక్తిగతంగా ఉన్న అనుబంధంతోనే షారుఖ్ ఖాన్.. దాదా వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానిక వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను కేకేఆర్ బౌలర్లు కేవలం 153 పరుగులకే కట్టడి చేశాడు. ఢిల్లీ బ్యాటర్లలో పంత్ 27, కుల్దీప్ యాదవ్ 35 రన్స్‌తో రాణించారు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది డీసీ. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా రెండేసి వికెట్లతో రాణించారు. ఇక 154 పరుగుల సింపుల్ టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్.. 16.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 68 పరుగులు చేశాడు. నరైన్ 15, రింకూ సింగ్ 11 రన్స్ చేసి త్వరగా అవుటైనా.. శ్రేయస్ అయ్యర్ 33, వెంకటేశ్ అయ్యర్ 26 రన్స్ చేసి మ్యాచ్‌ను ముగించారు. ఈ విజయంతో కేకేఆర్ ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీకి ఇది ఆరో ఓటమి. మరి ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయంతో పాటు.. దాదాను షారుఖ్ పలకరించిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
the way Shah Rukh Khan ran up to Sourav Ganguly to hug and kiss him, such a wholesome moment, KKR reunion 💜 pic.twitter.com/9I0yenj0V4
— sohom (@AwaaraHoon) April 29, 2024