iDreamPost
android-app
ios-app

IND vs SL: దెబ్బేసిన సీనియర్లు! ఇక వాళ్లపైనే హెడ్‌ కోచ్‌ గంభీర్‌ ఆశలన్నీ?

  • Published Aug 03, 2024 | 11:07 AM Updated Updated Aug 03, 2024 | 11:07 AM

శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఈజీగా విక్టరీ సాధించాల్సిన టీమిండియా.. చేజేతులా మ్యాచ్ ను టై చేసుకుంది. ఈ మ్యాచ్ లో సీనియర్లు విఫలం కావడంతో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్ ఆశలన్నీ ఆ ప్లేయర్ల మీదే పెట్టుకున్నాడు.

శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఈజీగా విక్టరీ సాధించాల్సిన టీమిండియా.. చేజేతులా మ్యాచ్ ను టై చేసుకుంది. ఈ మ్యాచ్ లో సీనియర్లు విఫలం కావడంతో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్ ఆశలన్నీ ఆ ప్లేయర్ల మీదే పెట్టుకున్నాడు.

IND vs SL: దెబ్బేసిన సీనియర్లు! ఇక వాళ్లపైనే హెడ్‌ కోచ్‌ గంభీర్‌ ఆశలన్నీ?

శ్రీలంకపై టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన యంగ్ టీమిండియా విజయ పరంపరను కొనసాగించడంలో భారత సీనియర్ల జట్టు తడబడింది. లంకతో జరిగిన చివరి టీ20లో ఓడిపోవాల్సిన స్థితి నుంచి సూపర్ ఓవర్లో అద్భుత విజయం సాధించింది భారత్. కానీ ఇప్పుడు తొలి వన్డే  మ్యాచ్ లో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా టై చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో సీనియర్లు దెబ్బేయడంతో.. భారత్ మ్యాచ్ ను టై చేసుకోకతప్పలేదు. దాంతో భవిష్యత్ లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆశలన్నీ వారిపైనే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శుక్రవారం కొలంబో వేదికగా తొలి వన్డే జరిగింది. ఇరు జట్ల మధ్య హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ టై గా ముగిసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. జట్టులో వెల్లలాగే(67*), నిశాంక(56) రాణించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ లు తలా  రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 231 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 47.5 ఓవర్లలో సరిగ్గా 230 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో మ్యాచ్ టై అయ్యింది. ఇది వన్డే కాబట్టి సూపర్ ఓవర్ లేదు. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే 58 పరుగులతో రాణించాడు.

ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా కచ్చితంగా గెలవాల్సింది. కానీ విరాట్ కోహ్లీ(24), శ్రేయస్ అయ్యర్(23), కేఎల్ రాహుల్(31) లాంటి సీనియర్ బ్యాటర్లు విఫలం కావడంతో.. భారత్ విజయం సాధించలేకపోయింది. సీనియర్లు దెబ్బేయడంతో.. కోచ్ గౌతమ్ గంభీర్ ఆశలన్నీ యంగ్ ప్లేయర్ల మీదే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే శ్రీలంకతో టీ20 సిరీస్ ను సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యంగ్ టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ లో సూర్యకుమార్, యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్ లాంటి యంగ్ ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. దాంతో గంభీర్ భవిష్యత్  ఆశలు వారిపైనే పెట్టుకోవాల్సిన పరిస్థితి.

వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ 2025, వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్ లను గెలవడానికి ఈ యంగ్ ప్లేయర్ల పైనే ఫొకస్ ఎక్కువగా పెట్టాలి గంభీర్. ఎందుకంటే? అప్పటికి రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు అందుబాటులో ఉంటారా? అన్నది అందరిలో మెదిలే ప్రశ్న. అందుకే గంభీర్ తన ఆశలన్నీ యంగ్ టీమిండియాపైనే పెట్టుకున్నాడు. పైగా వారు మంచి టచ్ లో ఉన్నారు. మరి కుర్రాళ్లపై హెడ్ కోచ్ భవిష్యత్ ఆశలు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.