iDreamPost
android-app
ios-app

IND vs SL: హెడ్‌ కోచ్‌గా తొలి వన్డేలో షాకింగ్‌ ఫలితం! గంభీర్‌ రియాక్షన్‌ ఇదే!

  • Published Aug 03, 2024 | 9:19 AM Updated Updated Aug 03, 2024 | 9:19 AM

Gautam Gambhir, IND vs SL: హెడ్‌ కోచ్‌గా టీ20 సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసి.. తొలి వన్డేలో ఇలాంటి ఫలితం ఎదురుకావడంతో.. భారత హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఎలా రియాక్ట్‌ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir, IND vs SL: హెడ్‌ కోచ్‌గా టీ20 సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసి.. తొలి వన్డేలో ఇలాంటి ఫలితం ఎదురుకావడంతో.. భారత హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఎలా రియాక్ట్‌ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 03, 2024 | 9:19 AMUpdated Aug 03, 2024 | 9:19 AM
IND vs SL: హెడ్‌ కోచ్‌గా తొలి వన్డేలో షాకింగ్‌ ఫలితం! గంభీర్‌ రియాక్షన్‌ ఇదే!

భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో ఫలితం తేలలేదు. కొలంబో వేదిక శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు ఈక్వల్‌ స్కోర్‌ చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. నిజానికి ఈ మ్యాచ్‌ టీమిండియానే గెలవాల్సింది. ఎందుకంటే.. చివరి 15 బంతుల్లో కేవలం ఒక్క పరుగుల కావాలి.. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. అయినా కూడా భారత జట్టు.. గెలుపు లైన్‌ను దాటలేకపోయింది. అయితే.. ఈ వన్డే గౌతమ్‌ గంభీర్‌కు హెడ్‌ కోచ్‌గా తొలి వన్డే అనే విషయం తెలిసిందే. రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌ గంభీర్‌.. మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి మంచి స్టార్‌ అందుకున్నాడు.

కానీ, వన్డే ఫార్మాట్‌లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి స్టార్లు ఉన్న జట్టుతో పసికూన లాంటి శ్రీలంక టీమ్‌పై విజయం సాధించలేకపోయారు. పైగా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను టై చేసుకుని.. ఘోర అవమానం పొందాడు. అయితే.. ఈ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో డగౌట్‌లో కూర్చోని మ్యాచ్‌ ఎంజాయ్‌ చేశాడు గంభీర్‌. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీతో మాట్లాడుతూ.. నవ్వుకుంటూ మ్యాచ్‌ చూస్తూ కనిపించాడు. కానీ మ్యాచ్‌ టై అయిన సమయంలో మాత్రం చాలా డల్‌గా, ఒకింత కోపంగా కూడా కనిపించాడు గంభీర్‌. మ్యాచ్‌ తర్వాత.. అతను పెట్టిన ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌ టై కావడంపై గౌతమ్‌ గంభీర్‌ ఏ మాత్రం సంతృప్తిగా లేడని సమాచారం. మ్యాచ్‌ తర్వాత.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూడా మ్యాచ్‌పై చాలా సేపు చర్చ జరిగినట్లు.. ఆటగాళ్లకు గంభీర్‌ క్లాస్‌ పీకినట్లు తెలుస్తోంది. రోహిత్‌ శర్మ నుంచి మంచి స్టార్ట్‌ లభించినా.. మిగతా బ్యాటర్లు ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారో తనకు అర్థం కావడం లేదంటూ.. గంభీర్‌ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం. మరి హెడ్‌ కోచ్‌గా తొలి వన్డేలోనే ఇలాంటి ఫలితం రావడం, దాన్ని గంభీర్‌ జీర్ణించుకోలేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.