iDreamPost
android-app
ios-app

IPL 2024: ఆ మాజీ ప్లేయర్ RCB జెర్సీ ధరించడం వల్లే టీమ్ ఓడిపోతోంది: ABD

  • Published Apr 17, 2024 | 2:32 PM Updated Updated Apr 17, 2024 | 2:32 PM

ఆర్సీబీ ఓటములకు కారణం చెప్పాడు ఆ టీమ్ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. అతడు ఆర్సీబీ జెర్సీ ధరించడం మూలంగానే జట్టు ఓడిపోతోందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఆర్సీబీ ఓటములకు కారణం చెప్పాడు ఆ టీమ్ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. అతడు ఆర్సీబీ జెర్సీ ధరించడం మూలంగానే జట్టు ఓడిపోతోందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

IPL 2024: ఆ మాజీ ప్లేయర్ RCB జెర్సీ ధరించడం వల్లే టీమ్ ఓడిపోతోంది: ABD

‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా తయ్యారైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పరిస్థితి. ప్రతీ ఐపీఎల్ సీజన్ లోకి ఎంతో గొప్పగా అడుగుపెట్టి.. దారుణంగా విఫలం అవుతూ ఉంటుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మాక్స్ వెల్, దినేశ్ కార్తీక్, విల్ జాక్స్, కామెరూన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్ లాంటి స్టార్ ప్లేయర్లు జట్టు నిండా ఉన్నప్పటికీ.. ఫలితం మాత్రం శూన్యం. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉసూరుమంటోంది. అయితే ఆర్సీబీ ఓటములకు కారణం చెప్పాడు ఆ టీమ్ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. అతడు ఆర్సీబీ జెర్సీ ధరించడం మూలంగానే జట్టు ఓడిపోతోందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించే స్థాయికి చేరుకుంది. ఇప్పటికే సగం మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించి.. అట్టడుగున ఉంది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇక ఆర్సీబీ దారుణ వైఫల్యానికి కారణం చెప్పుకొచ్చాడు ఆ జట్టు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. ఆర్సీబీ మాజీ ప్లేయర్ స్కాట్ స్టైరిష్ తమ జెర్సీ ధరించడం కారణంగానే వరుస ఓటములకు కారణంగా చెప్పి.. స్టైరిష్ జెర్సీని ధరించడం తక్షణమే ఆపాలని సూచించాడు.

ఇక ఈ కామెంట్ పై తాజాగా స్పందించాడు స్టైరిష్. జియో సినిమాలో పాల్గొన్న ఈ కివీస్ మాజీ ప్లేయర్ మాట్లాడుతూ..”ఏబీడీ నన్ను ఆర్సీబీ జెర్సీని ధరించడం ఆపేయాలని అన్నాడు. ఇందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే.. ఏబీడీ ఒక్కసారైనా సీఎస్కే జెర్సీని ధరించాలని నేను కోరుకుంటున్నాను. అతడు దీనికి సిద్ధమా?” అని స్టైరిష్ రివర్స్ కౌంటర్ వేశాడు. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. ఈ న్యూజిలాండ్ బ్యాటర్ గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.