iDreamPost

KKR vs RR: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ ఆల్ టైమ్ రికార్డ్.. ఏ జట్టు సాధించలేదు!

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది రాజస్తాన్ రాయల్స్ టీమ్. ఇప్పటి వరకు ఈ ఘనత ఏ టీమ్ కూడా సాధించలేకపోయింది.

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది రాజస్తాన్ రాయల్స్ టీమ్. ఇప్పటి వరకు ఈ ఘనత ఏ టీమ్ కూడా సాధించలేకపోయింది.

KKR vs RR: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ ఆల్ టైమ్ రికార్డ్.. ఏ జట్టు సాధించలేదు!

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న(ఏప్రిల్ 16) జరిగిన రాజస్తాన్ వర్సెస్ కోల్ కత్తా మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన మజాను పంచింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ పోరులో రాజస్తాన్ రాయల్స్ అద్భుతమైన విజయం సాధించింది. జోస్ బట్లర్ వీరోచిత శతకంతో చెలరేగడంతో.. 2 వికెట్లతో ఆర్ఆర్ టీమ్ గెలిచింది. దీంతో ఈ సీజన్ లో 6వ విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచ్ ద్వారా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ ను నెలకొల్పింది రాజస్తాన్ టీమ్. ఇప్పటి వరకు ఏ టీమ్ కూడా ఈ ఘనత సాధించలేదు. ఆ వివరాల్లోకి వెళితే..

ఈ ఐపీఎల్ సీజన్ సరికొత్త రికార్డులకు వేదికగా మారుతోంది. ఈ సీజన్ లో టీమ్స్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. టైటిల్ దిశగా సాగుతున్నాయి. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ నమోదు చేయగా.. తాజాగా తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా రాజస్తాన్ రాయల్స్ ఆల్ టైమ్ రికార్డ్ ను సెట్ చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది ఆర్ఆర్ టీమ్. 6 వికెట్లు కోల్పోయి 128 పరుగుల దశలో ఉన్న రాజస్తాన్ కు ఇంకా 6 ఓవర్లలో 96 పరుగులు అవసరం అయ్యాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో రోవ్ మన్ పావెల్ తో కలిసి బట్లర్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

RR all time record

ఈ క్రమంలోనే 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఏ టీమ్ కు సాధ్యం కాని సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఐపీఎల్ హిస్టరీలో ఛేజింగ్ లో 6వ వికెట్ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన జట్టుగా ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది రాజస్తాన్ టీమ్. ఈ క్రమంలోనే గతంలో(2016) ఆర్సీబీ జట్టు గుజరాత్ లయన్స్ పై చేసిన 91 పరుగుల రికార్డును బ్రేక్ చేసింది. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ 6వ వికెట్ పడిన తర్వాత 103 రన్స్ జోడించింది. అదే విధంగా అత్యధిక పరుగులు ఛేదించిన టీమ్ గానూ అవతరించింది. మరి రాజస్తాన్ క్రియేట్ చేసిన ఈ ఆల్ టైమ్ రికార్డ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి