iDreamPost
android-app
ios-app

సచిన్‌ విగ్రహంపై జోకులు! స్మిత్ స్టాచ్యూలా ఉందంటూ..!

  • Author singhj Published - 05:08 PM, Thu - 2 November 23

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ షిండే ఈ స్టాచ్యూను ఆవిష్కరించారు.

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ షిండే ఈ స్టాచ్యూను ఆవిష్కరించారు.

  • Author singhj Published - 05:08 PM, Thu - 2 November 23
సచిన్‌ విగ్రహంపై జోకులు! స్మిత్ స్టాచ్యూలా ఉందంటూ..!

సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ఫ్యాన్స్​కు పరిచయం అక్కర్లేని పేరు. జెంటిల్మన్​ గేమ్​ను ఇష్టపడే వారితో పాటు సాధారణ ప్రజలకు కూడా పరిచయం అక్కర్లేని పేరిది. తన బ్యాటింగ్​తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించాడు సచిన్. క్రికెట్​ను గ్లోబల్ స్టోర్ట్స్​గా మార్చడంలో అతడి పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి. క్రికెట్ అంటే ఏంటో తెలియని చాలా దేశాల వాళ్లు మాస్టర్ బ్లాస్టర్​ను గుర్తుపడతారు. అప్పట్లో సచిన్ బ్యాటింగ్ చేస్తున్నాడంటే చాలు ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోయేవారు. అతడు క్రీజులో ఉన్నాడంటే మ్యాచ్ భారత్​దేనని ధీమా ఉండేది. సచిన్ బ్యాటింగ్ చూసేందుకు ఎంప్లాయీస్ ఆఫీసులకు సెలవులు పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి.

పాత తరంతో పాటు యువతరాన్ని కూడా సచిన్ తన బ్యాటింగ్, డిసిప్లిన్, డెడికేషన్​తో ఇన్​స్పైర్ చేశాడు. దేశం కోసం ఫైట్ చేయడం, తమ బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నించాలనేది నేర్పాడు. అలాంటి సచిన్ టెండూల్కర్​ను ఎన్నో అవార్డులు వరించాయి. క్రికెట్ పిచ్​పై ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఈ బ్యాటింగ్ లెజెండ్​ను భారతరత్న లాంటి దేశ అత్యున్నత పురస్కారం కూడా లభించిన విషయం తెలిసిందే. అలాంటి సచిన్ విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ స్టాచ్యూను మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్ షిండే ఆవిష్కరించగా.. ఈ ప్రోగ్రామ్​కు భార్య అంజలి, కూతురు సారాతో కలసి హాజరయ్యాడు సచిన్.

విగ్రహావిష్కరణ తర్వాత సచిన్ మాట్లాడుతూ.. ఈ రోజు తన లైఫ్​లో ఎంతో స్పెషల్ అని అన్నాడు. ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. అయితే సచిన్ స్టాచ్యూపై సోషల్ మీడియాలో జోకులు పేలుతుండటం గమనార్హం. స్ట్రైట్ లాఫ్టెడ్ షాట్ కొడుతున్నట్లుగా ఉన్న ఈ సచిన్ విగ్రహంపై కొందరు నెటిజన్స్ జోక్స్ వేస్తున్నారు. ఈ స్టాచ్యూ సచిన్​లా కాదు.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్​ను పోలి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని చూసి సచిన్ కూడా షాకై తల పట్టుకొని ఉంటాడని చెబుతున్నారు. సచిన్ విగ్రహం అన్నారు.. తీరా చూస్తే స్మిత్​లా ఉందేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే మాస్టర్ బ్లాస్టర్ ఫ్యాన్స్ మాత్రం ఇది సచిన్ విగ్రహమేనని.. అతడిలాగే ఉందంటున్నారు. ఈ స్టాచ్యూ స్మిత్​లా లేదని.. అనవసరంగా పోలికలు తీసుకురావడం సరికాదంటున్నారు. మరి.. సచిన్ విగ్రహం వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఒకరి మీదే డిపెండ్ అవ్వం.. రోహిత్ సపోర్ట్ చేస్తున్నాడా? వార్నింగ్ ఇస్తున్నాడా?