iDreamPost
android-app
ios-app

Arjun Tendulkar: జట్టుకు భారంగా మారిన సచిన్‌ కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌!

  • Published Feb 06, 2024 | 11:45 AM Updated Updated Feb 06, 2024 | 10:23 PM

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌పై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అర్జున్‌ ఏం చేశాడు? ఎందుకు క్రికెట్‌ ఫ్యాన్స్‌ అతనిపై విమర్శలు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌పై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అర్జున్‌ ఏం చేశాడు? ఎందుకు క్రికెట్‌ ఫ్యాన్స్‌ అతనిపై విమర్శలు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 06, 2024 | 11:45 AMUpdated Feb 06, 2024 | 10:23 PM
Arjun Tendulkar: జట్టుకు భారంగా మారిన సచిన్‌ కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌!

దిగ్గజ క్రికెటర్‌, ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారాడు. ఇప్పుడు జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో అర్జున్‌ గోవా జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రంజీ సీజన్‌లో అర్జున్‌ చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆల్‌రౌండర్‌గా గోవా టీమ్‌లో చోటు దక్కించుకున్న అర్జున్‌.. రెండు విభాగాల్లోనూ విఫలమవుతూ.. ఆ జట్టుకు భారంగా మారాడు. తాజాగా ఎలైట్ గ్రూప్ సీలో భాగంగా సోమవారం తమిళనాడుతో ముగిసిన మ్యాచ్‌లో అర్జున్ 12 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఇక బ్యాటింగ్‌ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 1, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కేవలం నాలుగు వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో అతను వరుసగా 11, 10, 70, 52, 6, 23, 18, 1, 8 పరుగులు చేసి. బ్యాడ్‌ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లో 2/94, 0/14, 1/70, 0/70, 1/30, 0/52, 0/5లతో విఫలం అయ్యాడు. ఒకవైపు బౌలర్‌గా ధారళంగా పరుగులు సమర్పించుకుంటూ.. మరోవైపు బ్యాటర్‌గానూ విఫలం అవుతూ.. గోవా టీమ్‌కు భారంగా మారాడు.

arjun tendulakar worest batting

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తమిళనాడుతో సోమవారం ముగిసిన మ్యాచ్‌లో గోవా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గోవా 241 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులు చేసింది. 32 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన గోవా 168 పరుగులకే కుప్పకూలింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 49.5 ఓవర్లలో 3 వికెట్లకు 142 పరుగులు చేసి గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనతో అర్జున్‌పై విమర్శలు వస్తున్నాయి. సచిన్ కొడుకు కాకపోయి ఉంటే కనీసం క్లబ్ స్థాయి క్రికెట్ ఆడేందుకు కూడా అర్హత సాధించేవాడు కాదని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే అనవసరంగా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని.. సచిన్‌ పరువు తీస్తున్నాడంటూ కొంతమంది సచిన్‌ అభిమానులు తమ అసంతృప్తిని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.