Nidhan
ఒక యంగ్ క్రికెటర్ చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల వయసులోనే ఏకంగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసేశాడు. ఎవరా క్రికెటర్? అతడు బద్దలు కొట్టిన సచిన్ రికార్డు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
ఒక యంగ్ క్రికెటర్ చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల వయసులోనే ఏకంగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసేశాడు. ఎవరా క్రికెటర్? అతడు బద్దలు కొట్టిన సచిన్ రికార్డు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
Nidhan
క్రికెట్లో వయసుకు ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. జెంటిల్మన్ గేమ్‌కు సంబంధించి కెరీర్‌ను త్వరగా మొదలుపెట్టిన వారికి నేషనల్ టీమ్‌లోకి వచ్చేందుకు, ఎక్కువ కాలం ఆడేందుకు ఛాన్సులు అధికంగా ఉంటాయి. లాంగ్ కెరీర్‌ను బిల్డ్ చేసుకోవాలంటే స్మాల్ ఏజ్‌లోనే క్రికెట్లోకి రావాలి. అలాగే జాతీయ జట్టుకు తక్కువ టైమ్‌లోనే ఎంపికవ్వాలి. అయితే కొందరు కెరీర్ ఆలస్యంగా స్టార్ట్ చేయడం, పోటీని తట్టుకొని నేషనల్ టీమ్‌కు ఆడే సరికి వయసు ఎక్కువైపోతుంది. సచిన్ టెండూల్కర్ లాంటి కొందరు క్రికెటర్లు మాత్రం చిన్న వయసులోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమ ప్రతిభను నిరూపించుకొని జాతీయ జట్టుకు ఎంపికై, ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో లెజెండ్స్‌గా ఎదిగారు. సచిన్ 15 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి, 16 ఏళ్లకు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాంటి మాస్టర్ బ్లాస్టర్ రికార్డును ఓ 14 ఏళ్ల కుర్రాడు బ్రేక్ చేశాడు.
బిహార్‌కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి రికార్డు క్రియేట్ చేశాడు. టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 15 సంవత్సరాల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సంవత్సరం నేరుగా భారత జట్టు తరఫున ఆడుతూ తన ఇంటర్నేషనల్ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. అయితే యువ క్రికెటర్ వైభవ్ మాత్రం 14 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను మొదలుపెట్టడం గమనార్హం. ఇవాళ పాట్నా వేదికగా బిహార్-ముంబై మధ్య రంజీ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో బిహార్ తరఫున ఆడుతున్నాడు వైభవ్. ఇంటర్నెట్లో అతడి వయసు 12 ఏళ్ల 284 రోజులుగా చూపిస్తోంది. కానీ సెప్టెంబర్ 2023 నాటికి తనకు 14 ఏళ్లు నిండుతాయని ఒక ఇంటర్వ్యూలో సూర్యవంశీ స్వయంగా చెప్పుకొచ్చాడు.
చిన్న వయసులోనే అద్భుతాలు చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. బ్యాట్‌తో చెలరేగుతూ సూపర్బ్ నాక్స్ ఆడుతున్నాడు. ఏజ్ తక్కువైనా, అనుభవం లేకపోయినా తన కంటే పెద్ద వయసు బౌలర్ల బౌలింగ్‌లోనూ చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు. పేస్, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ సంచలన ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలుస్తున్నాడు. గతేడాది అతడు ఇండియా అండర్-19 బీ టీమ్‌లో భాగమయ్యాడు. ఆ టీమ్ ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో సిరీస్‌ల్లో పాల్గొంది. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఐదు మ్యాచుల్లో కలిపి 177 పరుగులు చేశాడు. ఆ టైమ్‌లో అతడి బ్యాట్ నుంచి ఓ హాఫ్ సెంచరీ కూడా వచ్చింది.
గతేడాది అండర్-19బీ టీమ్‌కు ఆడటంతో పాటు వినూ మన్కడ్ ట్రోఫీ-2023లోనూ పాల్గొన్నాడు వైభవ్ సూర్యవంశీ. ఆ టోర్నమెంట్లో ఐదు మ్యాచుల్లో కలిపి ఏకంగా 393 పరుగులు చేశాడు. కూచ్ బెహార్ ట్రోఫీలోనూ జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 151, 76 పరుగుల ఇన్నింగ్స్‌లతో అలరించాడు. ఆరేళ్ల వయసులో క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసిన వైభవ్ సూర్యవంశీ ఏడేళ్లు ఉన్నప్పుడు అకాడమీలో చేరాడు. రంజీ మాజీ క్రికెటర్ మనీష్ ఓజా అతడికి ట్రైనింగ్ ఇచ్చి తీర్చిదిద్దాడు. తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యవంశీ.. 14 ఏళ్లకే రంజీలకు సెలక్ట్ అయి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. వైభవ్ ఆట చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అతి త్వరలో టీమిండియాలోకి అతడు ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి.. సచిన్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేయడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: AUS vs PAK: వీడియో: ఇలాంటి నో బాల్ ఎప్పుడూ చూసి ఉండరు.. పాకిస్థానీలు అంటార్రా బాబు!
Vaibhav Suryavanshi pic.twitter.com/SkVQLVD7wV
— RVCJ Media (@RVCJ_FB) January 5, 2024