iDreamPost

AUS vs PAK: వీడియో: ఇలాంటి నో బాల్ ఎప్పుడూ చూసి ఉండరు.. పాకిస్థానీలు అంటార్రా బాబు!

  • Published Jan 05, 2024 | 2:47 PMUpdated Jan 05, 2024 | 2:47 PM

పాకిస్థాన్ క్రికెటర్లు గ్రౌండ్​లో చేసే కొన్ని చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఎప్పుడూ ఫన్నీ ఫీల్డింగ్​తో వార్తల్లో నిలిచే దాయాది జట్టు.. ఈసారి నో బాల్​తో ట్రెండింగ్​లోకి వచ్చింది.

పాకిస్థాన్ క్రికెటర్లు గ్రౌండ్​లో చేసే కొన్ని చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఎప్పుడూ ఫన్నీ ఫీల్డింగ్​తో వార్తల్లో నిలిచే దాయాది జట్టు.. ఈసారి నో బాల్​తో ట్రెండింగ్​లోకి వచ్చింది.

  • Published Jan 05, 2024 | 2:47 PMUpdated Jan 05, 2024 | 2:47 PM
AUS vs PAK: వీడియో: ఇలాంటి నో బాల్ ఎప్పుడూ చూసి ఉండరు.. పాకిస్థానీలు అంటార్రా బాబు!

క్రికెట్​లో అప్పుడప్పుడూ కొన్ని అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటాయి. జెంటిల్మన్ గేమ్​లో ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతుంటాయి. వీటిని చూసి ఏంట్రా బాబు అనుకుంటారు. ఇవి మ్యాచులను చూసే ఆడియెన్స్​, ఫ్యాన్స్​తో పాటు గ్రౌండ్​లో ఆడే క్రికెటర్లనూ నవ్విస్తుంటాయి. ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతుంటాయి. క్రికెట్ టీమ్స్ అన్నింటిలోనూ పాకిస్థాన్​ ఇలాంటి వాటిల్లో ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా ఆ దేశ ప్లేయర్లు గ్రౌండ్​లో మిస్ ఫీల్డింగ్​తో వైరల్ అవుతుంటారు. చేతుల్లోకి వచ్చిన ఈజీ క్యాచుల్ని నేలపాలు చేస్తూ, సాధారణ బాల్​ను కూడా ఆపడంలో ఫెయిల్ అవుతుంటారు. అయితే ఈసారి ఫీల్డింగ్​లో కాకుండా బౌలింగ్​ పరంగా ఆ టీమ్ వార్తల్లో నిలిచింది. పాక్ యంగ్ ఆల్​రౌండర్ ఆమిర్ జమాల్ వేసిన ఓ నో బాల్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియా-పాకిస్థాన్​ మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్​లో జరుగుతున్న రెండో టెస్ట్​లో ఓ నో బాల్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతోంది. డ్రింక్స్ బ్రేక్ తర్వాత సెకండ్ సెషన్ స్టార్ట్ అయింది. స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ క్రీజులో ఉన్నాడు. అప్పుడు బౌలింగ్​ వేసేందుకు వచ్చాడు పాక్ పేసర్ ఆమిర్ జమాల్. అయితే తన చేతిలో బాల్ లేకున్నా పరిగెత్తుకుంటూ వచ్చి యాక్షన్ కంప్లీట్ చేయబోయాడు. అంపైర్​ను సమీపించగానే రెండు చేతులు చూపిస్తూ తన దగ్గర బాల్ లేదని చెప్పాడు. దీంతో బాల్​ను ఎదుర్కొనేందుకు రెడీ అయిన లబుషేన్ తెల్లబోయాడు. నాన్​ స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్న స్టీవ్ స్మిత్ కూడా ఏం జరిగింది అన్నట్లు చేయి చూపించాడు. ఈ బంతిని అంపైర్ నోబాల్​గా ప్రకటించాడు. దీంతో బౌలర్ ఆమిర్ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

ఆమిర్ జమాల్ వెరైటీ నో బాల్​కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లబుషేన్​తో మైండ్ గేమ్ ఆడాలనే ఉద్దేశంతోనే ఇలా చేతిలో బాల్ లేకపోయినా జమాల్ బౌలింగ్ చేశాడని పాక్ అభిమానులు అంటున్నారు. అయితే నెటిజన్స్ మాత్రం అతడి తీరును తప్పుబడుతున్నారు. చేతిలో బాల్ లేకున్నా డమ్మీ త్రోలు వేయడం అనేది ఫీల్డింగ్​లో కామన్ అని.. కానీ బౌలింగ్​లో ఇలా చేయడం ఏంటని సీరియస్ అవుతున్నారు. ఫీల్డర్లు డమ్మీ త్రోలతో బ్యాటర్లను రనౌట్ చేయొచ్చని.. కానీ బౌలర్లు ఇలా చేయడం హాస్యాస్పదమని చెబుతున్నారు. స్వింగ్ గురించి దాచిపెట్టేందుకు నార్మల్​గా బౌలర్లు బాల్​ను కనిపించకుండా హోల్ట్ చేసి బౌలింగ్ వేస్తుంటారు. కానీ చేతుల్లో బాల్ లేకున్నా బౌలింగ్ చేయడం కేవలం దాయాది జట్టు క్రికెటర్లకే సాధ్యమని.. అందుకే పాకిస్థానీలు అంటార్రా బాబు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, వెరైటీ నో బాల్ వేసిన ఆమిర్ ఈ మ్యాచ్​ మొదటి ఇన్నింగ్స్​లో 82 రన్స్ చేశాడు. ఆ తర్వాత బౌలింగ్​లోనూ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. మరి.. జమాల్ వెరైటీ నో బాల్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat-Rohit: కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్​పై అప్​డేట్.. ఆ విషయాన్ని BCCIకి చెప్పేశారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి