Somesekhar
స్టార్ హీరో కిచ్చ సుదీప్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకుందాం పదండి.
స్టార్ హీరో కిచ్చ సుదీప్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకుందాం పదండి.
Somesekhar
 
        
అప్పుడప్పుడు జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సామాన్య వ్యక్తులకే కాకుండా.. సెలబ్రిటీలకు కూడా ఇలా జరుగుతాయి. తాజాగా స్టార్ హీరో కిచ్చ సుదీప్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. ఇది చూసిన సుదీప్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. మరి ఇంతకీ సచిన్ ఇచ్చిన ఆ సర్ప్రైజ్ ఏంటి? ఆ వివరాల గురించి తెలుసుకుందాం పదండి.
కిచ్చ సుదీప్.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాడు. అయితే సుదీప్ నటుడే కాకుండా మంచి క్రికెటర్ కూడా. చిన్నప్పటి నుంచి సుదీప్ కు క్రికెటర్ అవ్వాలని ఉండేదట. కానీ అది కుదరలేదు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన తర్వాత కూడా క్రికెట్ పై తనకు ఉన్న ప్రేమను మాత్రం చంపుకోలేదు. అవకాశం ఉన్నప్పుడల్లా టోర్నమెంటుల్లో మెరుస్తుంటాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) తో పాటుగా పలు క్రికెట్ టోర్నీల్లో ఆడుతుంటాడు. ఇక ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తుంటాడు సుదీప్. దీంతో ఎప్పటిలాగే ‘ఆస్క్ కిచ్చా’ అనే హ్యాష్ టాగ్ ద్వారా అభిమానులు అడిగే ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు ఇచ్చాడు.
ఈ క్రమంలోనే ఓ అభిమాని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తో సుదీప్ దిగిన ఫొటోను షేర్ చేసి సచిన్ ను కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అని అడిగాడు. దీనికి సుదీప్ సమాధానంగా..”ఈ పిక్ చాలా అద్భుతమైంది. నా జీవితంలో ఓ మర్చిపోలేని జ్ఞాపకం” అని రిప్లై ఇచ్చాడు. అయితే ఈ రిప్లైకి వెంటనే స్పందించాడు సచిన్ టెండుల్కర్.”మిమ్మల్ని ఆ రోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. మనిద్దరిని ఎవరో చాలా చక్కగా ఫొటో తీశారు. ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, లైఫ్ లో సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని హిందీలో ట్వీట్ చేశాడు.
అయితే సచిన్ నుంచి ఊహించని సర్ప్రైజ్ రిప్లైకి కిచ్చ సుదీప్ సంతోషంతో గంతులేస్తున్నాడు. “వావ్ ఇది నేను ఊహించలేదు. మరో మంచి జ్ఞాపకం ఇచ్చినందుకు ధన్యవాదాలు” అంటూ సచిన్ కు కృతజ్ఞతలు తెలిపాడు కిచ్చా సుదీప్. ప్రస్తుతం ఈ పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి కిచ్చా సుదీప్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన సచిన్ టెండుల్కర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
It was lovely meeting you. Aur uss din kisine hamara ye photo bhi kitna acha KICHCHA tha. Always wishing you good health and happiness in life. 😊 https://t.co/D3o1ZvwOUM
— Sachin Tendulkar (@sachin_rt) February 2, 2024
ఇదికూడా చదవండి: Sachin Dhas: అండర్19లో సచిన్! పేరే కాదు.. ఆటలో కూడా అలానే..
