iDreamPost
android-app
ios-app

సూపర్ స్టార్ వచ్చేశాడు.. తర్వాతి తరం అతడిదే! యంగ్ ప్లేయర్ పై సచిన్ ప్రశంసలు

  • Author Soma Sekhar Published - 10:50 AM, Tue - 18 July 23
  • Author Soma Sekhar Published - 10:50 AM, Tue - 18 July 23
సూపర్ స్టార్ వచ్చేశాడు.. తర్వాతి తరం అతడిదే! యంగ్ ప్లేయర్ పై సచిన్ ప్రశంసలు

ప్రపంచ క్రీడా రంగంలో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నారు. అయితే ఆ దిగ్గజాలకు దిగ్గజాలే అభిమానులు అయితే.. అదో ఆసక్తికర సందర్భం. మరి అలాంటి దిగ్గజం ఓ యంగ్ ప్లేయర్ ఆటకు ఫిదా అయ్యి.. అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. సూపర్ స్టార్ వచ్చేశాడని, తర్వాతి తరం అతడిదే అని కితాబిచ్చాడు భారత దిగ్గజం, మాజీ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. అదీకాక అతడిని వచ్చే 10-12 ఏళ్లు అనుసరిస్తా అంటూ ట్వీట్ చేశాడు. మరి సచిన్ ను అంతగా ఆకట్టుకున్న ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సచిన్ టెండుల్కర్.. క్రికెట్ చరిత్రలో ఈ పేరు ఓ ఎవరెస్ట్. సాధ్యం కాని ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుని రికార్డుల రారాజుగా వెలుగొందుతున్నాడు. ఇక తన ఆటతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయినప్పటికీ తాను ఓ ఆటగాడకి అభిమాని అని గతంలోనే చెప్పుకొచ్చాడు. సచిన్ క్రికెట్ లోకి రాక ముందు టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ను ఆరాధించేవాడు. వింబుల్డన్ కు ప్రత్యేకంగా వచ్చి.. అతడిని కలిశాడు కూడా. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అయితే ఇక నుంచి ఫెదరర్ ను ఆనుసరించినట్లుగానే ఓ యంగ్ టెన్నిస్ ప్లేయర్ ను అనుసరిస్తానని ట్వీట్ చేశాడు మాస్టర్ బ్లాస్టర్. వింబుల్డన్ లో నొవాక్ జకోవిచ్ ఆధిపత్యానికి తెరదించుతూ.. 20 ఏళ్ల కుర్ర ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ సంచలనం సృష్టించాడు.

ఈ నేపథ్యంలో అల్కరాస్ పై ప్రశంసలు కురిపించాడు సచిన్. “వింబుల్డన్ ఫైనల్లో జకోవిచ్-అల్కరాస్ మధ్య పోరు అదిరిపోయింది. ఇద్దరూ అద్భుతంగా ఆడారు. అయితే అల్కరాస్ రూపంలో టెన్నిస్ లో కొత్త సూపర్ స్టార్ ను చూస్తున్నాం. రోజర్ ఫెదరర్ ను ఫాలో అయినట్లుగానే వచ్చే 10-12 సంవత్సరాలు అల్కరాస్ ను ఫాలో అవుతా” అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. కాగా.. వింబుల్డన్ రన్నరప్ గా నిలిచిన జకోవిచ్ ను ప్రశంసించాడు. మానసిక ధృఢత్వం = జకోవిచ్.. శారీరక, మానసిక సమస్యలు ఎన్ని ఉన్నా గానీ టెన్నిస్ లో రాణిస్తున్నాడు అంటూ కితాబిచ్చాడు సచిన్. ఇంత చిన్న వయసులో దిగ్గజ ఆటగాడికి షాకిచ్చిన అల్కరాస్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇదికూడా చదవండి: ప్రపంచ చరిత్రలో రెండోసారి.. ఆమె కాఫీ తాగుతుండగా..