iDreamPost

ప్రపంచ చరిత్రలో రెండోసారి.. ఆమె కాఫీ తాగుతుండగా..

ప్రపంచ చరిత్రలో రెండోసారి.. ఆమె కాఫీ తాగుతుండగా..

ఆకాశంలోంచి అప్పుడప్పుడు గ్రహ శకలాలు భూమ్మీద పడటం జరుగుతూ ఉంటుంది. భూమ్మీద పడే శకలాల పరిమాణాల్ని బట్టి.. అది పడే ప్రదేశాన్ని బట్టి నష్ట తీవ్రత ఉంటుంది. అయితే, గ్రహ శకలాలు భూమ్మీద పడటం సర్వ సాధారణం అయినా.. అవి మనుషులపై పడటం అత్యంత అరుదు. 1954లో తొలిసారి ఓ మహిళపై గ్రహ శకలం పడింది. అంటే ఇప్పటికి దాదాపు 60 ఏళ్ల క్రితం ఈ సంఘటన జరిగింది. ఇన్నేళ్ల తర్వాత తాజాగా ఇలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై గ్రహ శకలం పడింది. దీంతో ఆమె ఛాతికి గాయమైంది. ఈ సంఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది.

ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్‌లోని అల్సాస్‌కు చెందిన ఓ మహిళ తన ఇంటి టెర్రస్‌పై కాఫీ తాగుతూ ఉంది. కాఫీ తాగుతూ చుట్టూ ఉన్న ప్రకృతిని ఎంజాయ్‌ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదో డబ్‌మని ఆమె పక్కన పడింది. ఆ వెంటనే అది నేలపై పడి ఎగిరింది. నేరుగా సదరు మహిళ ఛాతిని ఢీకొట్టింది. ఆ దెబ్బకు ఆమె రొమ్ము ఎముకలు విరిగినంత పనైంది. తనపై పడ్డది ఓ జంతువువో అనుకుందామె. తర్వాత పరీక్షగా చూస్తే అది ఓ రాయి అని అర్థం అయింది. దాన్ని ఆమె ఓ సిమెంట్‌ రాయి అనుకుంది. తర్వాత దాన్ని జియోలజిస్టులతో పరీక్ష చేయించింది.

దాన్ని పరీక్షించిన వారు అదో గ్రహ శకలం అని తేల్చారు. వారు మాట్లాడుతూ.. ‘‘ గ్రహ శకలం మనిషిపై పడటం అన్నది అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. 1954లో తొలిసారి ఇలాంటి సంఘటన జరిగింది. ఆ తర్వాత ఇది రెండోది. ఈ శతాబ్థంలో గ్రహ శకలాలు ఫ్రాన్స్‌లో పడటం కేవలం ఐదు సార్లు మాత్రమే జరిగింది. బిలియన్ల మనుషుల్లో ఒకరిపై మాత్రమే ఇలా గ్రహ శకలాలు పడుతూ ఉంటాయి’’ అని పేర్కొన్నారు. మరి, టెర్రస్‌పై టీ తాగుతూ ఉన్న మహిళపై గ్రహ శకలం పడ్డ ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి