iDreamPost
android-app
ios-app

శిఖర్ ధావన్ రిటైర్మెంట్.. సచిన్ ఎమోషనల్! ట్వీట్ వైరల్..

  • Published Aug 25, 2024 | 3:49 PM Updated Updated Aug 25, 2024 | 3:49 PM

Sachin emotional tweet on Dhawan retirement: టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ వీడ్కోలు పై ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. 

Sachin emotional tweet on Dhawan retirement: టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ వీడ్కోలు పై ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. 

శిఖర్ ధావన్ రిటైర్మెంట్.. సచిన్ ఎమోషనల్! ట్వీట్ వైరల్..

టీమిండియా స్టార్ క్రికెటర్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఇంటర్నేషనల్ కెరీర్ కు తాజాగా వీడ్కోలు పలికాడు. ఇక ఇతడు తీసుకున్న షాకింగ్  డెసిషన్ తో ఫ్యాన్స్ తో సహా అందరూ షాక్ కు గురైయ్యారు. ఇక ధావన్ రిటైర్మెంట్ పై సహచర క్రీడాకారులు అతడితో తమకు ఉన్న అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే గబ్బర్ అల్విదాపై ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది.

భారత స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించడం.. దిగ్గజ క్రికెటర్లతో పాటుగా సహచర ఆటగాళ్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే విషయాన్ని కొందరు ప్లేయర్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. తాజాగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా ధావన్ వీడ్కోలు పై ట్వీట్ చేశాడు. “శిఖర్ ధావన్.. నీ జోష్, స్మైల్, నీ స్టైల్ ను గ్రౌండ్ చాలా మిస్ అవుతుంది. మీరు ఆటను ప్రేమించిన విధానం అమోఘం. ఇక మీరు మీ క్రికెట్ కెరీర్ కు సంబంధించిన పేజీలను తిరగేస్తున్నప్పుడు కచ్చితంగా మీ లెగస్సీని అభిమానులు, సహచరుల హృదయాల్లో నిలిచిపోతుందని తెలుసుకోండి. కీప్ స్మైలింగ్ శిఖర్” అంటూ రాసుకొచ్చాడు మాస్టర్ బ్లాస్టర్.

sachin emotional about dhawan

కాగా.. ఫియర్ లెస్ నాక్స్ ఆడి నువ్వు నిజమైన గబ్బర్ అనిపించుకున్నావ్, ఐసీసీ టోర్నీల్లో నీ ఫర్పామెన్స్ అమోఘం, నీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటూ టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ సైతం ధావన్ రిటైర్మెంట్ పై స్పందించాడు. ఎన్నో మరపురాని అనుభూతులను మాకు అందించావు, ఆట పట్ల నీకు ఉన్న అభిరుచి, క్రీడాస్ఫూర్తి, నీ చిరునవ్వును మేము కచ్చితంగా మిస్ అవుతామని కింగ్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.