Sachin Tendulkar: కన్నీళ్లు పెట్టిస్తున్న సచిన్ పోస్ట్.. ఆయన్ను తలచుకొని క్రికెట్ గాడ్ ఎమోషనల్!

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ట్విట్టర్​లో పెట్టిన ఓ పోస్ట్ అభిమానులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆ పోస్ట్​లో ఒక వ్యక్తిని తలచుకొని ఎమోషనల్ లోనయ్యాడతను. సచిన్ ఆ పోస్ట్ ఎవరి గురించి పెట్టాడంటే..!

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ట్విట్టర్​లో పెట్టిన ఓ పోస్ట్ అభిమానులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆ పోస్ట్​లో ఒక వ్యక్తిని తలచుకొని ఎమోషనల్ లోనయ్యాడతను. సచిన్ ఆ పోస్ట్ ఎవరి గురించి పెట్టాడంటే..!

లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి ఎంత చెప్పుకున్నా.. మాట్లాడుకోవాల్సింది ఇంకా చాలా మిగిలే ఉంటుంది. మాస్టర్ బ్లాస్టర్ చేసిన పరుగులు, చేసిన సెంచరీలు, సృష్టించిన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. సచిన్ వంద సెంచరీల రికార్డుకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్ప ఇంకే ప్లేయర్ దగ్గర్లో లేడు. క్రికెట్ హిస్టరీలో లిటిల్ మాస్టర్ క్రియేట్ చేసిన మిగతా రికార్డులను అందుకోవడం ఈ తరం క్రికెటర్లకు అంత ఈజీ కాదు. 16 ఏళ్ల చిన్న వయసులో కెరీర్​ను స్టార్ట్ చేసి.. 24 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం భారత టీమ్​కు సేవలు అందించిన సచిన్ ఊరికే ఈ స్థాయికి చేరుకోలేదు. అతడి సక్సెస్ వెనుక తండ్రి రమేశ్ టెండూల్కర్ పాత్ర ఎంతగానో ఉంది. ఇవాళ రమేష్ టెండూల్కర్ బర్త్ డే. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇది అభిమానులకు కన్నీళ్లు పెట్టిస్తోంది.

లైఫ్​లో, కెరీర్​లో తాను ఈ స్థాయిలో ఉండేందుకు తండ్రి రమేష్ టెండూల్కర్ ఇచ్చిన సపోర్ట్ కారణమని ట్విట్టర్​లో పెట్టిన పోస్ట్​లో సచిన్ రాసుకొచ్చాడు. ‘నాన్న మా విషయంలో ఎంతో కేర్ తీసుకునేవారు. కానీ ఎప్పుడూ స్ట్రిక్ట్​గా వ్యవహరించలేదు. నా జీవితంలో నేనేం చేయాలనుకుంటున్నానో దాన్ని ఎంచుకోవడానికి ఆయన నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నా డ్రీమ్స్ అందుకోవడానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎల్లప్పుడూ పూర్తి స్వేచ్ఛను ఇస్తూ, ప్రేమను పంచుతూ ఆయన తన పిల్లల్ని పెంచిన విధానం పేరెంటింగ్​లో ఎక్స్​లెంట్ లెసన్ అనే చెప్పాలి. ఆయన ఎప్పుడూ ముందుచూపుతో ఉండేవారు. ఆయన్ను అమితంగా ప్రేమించడానికి అదే ముఖ్య కారణం. హ్యాపీ బర్త్​ డే నాన్న. ప్రతి రోజూ మిమ్మల్ని మిస్సవుతున్నా’ అని ట్విట్టర్​లో సచిన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

ఈ రోజుకు సచిన్ లైఫ్​లో మరో స్పెషాలిటీ కూడా ఉంది. సరిగ్గా 34 ఏళ్ల కింద ఇదే రోజు వన్డే క్రికెట్​లో మాస్టర్ బ్లాస్టర్ అరంగేట్రం చేశాడు. 1989, డిసెంబర్ 18న దాయాది పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో సచిన్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ మ్యాచ్​లో భారత జట్టు ఓటమి పాలైంది. ఆ మ్యాచ్​లో పాక్ టీమ్ 88 రన్స్ చేయగా.. ఛేజింగ్​లో టీమిండియా 80 పరుగులే చేయగలిగింది. ఐదో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చిన సచిన్ రెండు బంతులు ఎదుర్కొని వకార్ యూనిస్‌ బౌలింగ్​లో వసీం అక్రమ్​కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, పదేళ్ల కిందే క్రికెట్​కు గుడ్​ బై చెప్పిన సచిన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ముంబై ఇండియన్స్ టీమ్​కు మెంటార్​గా సేవలు అందిస్తున్నాడు. మరి.. సచిన్​ ఎమోషనల్ పోస్ట్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Kuldeep Yadav: ఆ పీడకలను మర్చిపోలేకపోతున్నా.. ఇంకా వెంటాడుతోంది: కుల్దీప్ యాదవ్

Show comments