iDreamPost

Kuldeep Yadav: ఆ పీడకలను మర్చిపోలేకపోతున్నా.. ఇంకా వెంటాడుతోంది: కుల్దీప్ యాదవ్

  • Published Dec 18, 2023 | 4:41 PMUpdated Dec 18, 2023 | 4:41 PM

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనను ఓ పీడకల ఇంకా వెంటాడుతోందని అన్నాడు. దాన్ని తాను మర్చిపోలేకపోతున్నానని చెప్పాడు. అసలు కుల్దీప్ చెబుతున్న ఆ నైట్​మేర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనను ఓ పీడకల ఇంకా వెంటాడుతోందని అన్నాడు. దాన్ని తాను మర్చిపోలేకపోతున్నానని చెప్పాడు. అసలు కుల్దీప్ చెబుతున్న ఆ నైట్​మేర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 18, 2023 | 4:41 PMUpdated Dec 18, 2023 | 4:41 PM
Kuldeep Yadav: ఆ పీడకలను మర్చిపోలేకపోతున్నా.. ఇంకా వెంటాడుతోంది: కుల్దీప్ యాదవ్

సౌతాఫ్రికా టూర్​లో టీమిండియా అదరగొడుతోంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్​ను 1-1తో సమం చేసిన భారత జట్టు.. వన్డే సిరీస్​లోనూ బోణీ కొట్టింది. మూడు వన్డేల సిరీస్​లో భాగంగా ఆదివారం ప్రొటీస్​తో జరిగిన ఫస్ట్ మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో భారీ విక్టరీ నమోదు చేసింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 116 పరుగుల టార్గెట్​ను మరో 200 బంతులు ఉండగానే ఊది పారేసింది. ఈ మ్యాచ్​లో భారత్ విజయానికి బౌలర్లే కారణం. అర్ష్​దీప్ సింగ్ (5/37 ), అవేశ్ ఖాన్ (4/27 ) చెలరేగడంతో సౌతాఫ్రికా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ కూడా ఒక వికెట్​ తీశాడు. అయితే కుల్దీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఓ పీడకలను మర్చిపోలేకపోతున్నానని.. అది ఇంకా వెంటాడుతోందని అన్నాడు.

కుల్దీప్​ను వెంటాడుతున్న పీడకల మరేంటో కాదు వన్డే వరల్డ్ కపేనట. ఇటీవల జరిగిన మెగా టోర్నీ ఫైనల్​లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి నుంచి తాను ఇంకా బయట పడలేకపోతున్నానని చెప్పాడు స్టార్ స్పిన్నర్. ‘ఆ ఓటమి తర్వాత మొదట్లో కొన్ని రోజులు కష్టంగా గడిచాయి. వారం నుంచి 10 రోజుల వరకు చాలా టఫ్​గా సాగింది. పొద్దున నిద్రలేవగానే వరల్డ్ కప్ ఫైనల్​లో ఓడిపోయామనే ఫీలింగ్ నన్ను వెంటాడేది. కానీ లైఫ్​లో ముందుకు వెళ్తూనే ఉండాలి’ అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు కుల్దీప్. ఇక, సౌతాఫ్రికా సిరీస్​ గురించి మాట్లాడుతూ.. ఇక్కడ చివరగా ఐదేళ్ల కింద ఆడానని గుర్తుచేసుకున్నాడు. టీ20 సిరీస్​లో భాగంగా ఆఖరి మ్యాచ్​లో 5 వికెట్లు తీయడం తనకు చాలా స్పెషల్ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. టీమ్ గెలుపు కోసం మాత్రమే ప్రయత్నించానని.. కానీ ఐదు వికెట్లు తీస్తానని అనుకోలేదన్నాడు.

టీ20ల్లో చాన్నాళ్ల తర్వాత బౌలింగ్​కు దిగడంతో మొదట్లో కాస్త భయం వేసిందన్నాడు కుల్దీప్. రిథమ్​ను అందుకోగలనా అనే అనుమానం వచ్చిందన్నాడు. కానీ బాల్​ను తన చేతి నుంచి అనుకున్న విధంగా రిలీజ్ చేయడం, పిచ్ కూడా టర్న్​కు సహకరించడంతో బాగా బౌలింగ్ చేయగలిగానన్నాడు. కాగా, కుల్దీప్​ మాత్రమే కాదు.. వరల్డ్ కప్ ఫైనల్​ ఓటమిలో నుంచి చాలా మంది టీమిండియా ప్లేయర్లు బయటకు రాలేకపోతున్నారు. 2011 తర్వాత నుంచి అందకుండా ఉన్న ప్రపంచ కప్​ను గెలుచుకోవాలనే డ్రీమ్ చెదిరిపోవడంతో భారత జట్టు అభిమానులు కూడా బాధలోనే ఉన్నారు. 2003 ఫైనల్​లాగే 2023 ఫైనల్ కూడా అందరికీ ఓ పీడకలగా మారింది. మరి.. ఆసీస్​ చేతిలో ఓటమిని మర్చిపోలేకపోతున్నానంటూ కుల్దీప్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Naveen ul Haq: బిగ్‌ బ్రేకింగ్‌: నవీన్‌ ఉల్‌ హక్‌పై నిషేధం! కారణం ఏంటంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి