Nidhan
టీమిండియా లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ సింపుల్‌గా, కూల్‌గా ఉంటారు. అలాంటోళ్లు షాంపెయిన్తో రచ్చ రచ్చ చేస్తారని ఊహించగలరా? కానీ ఇది జరిగింది.
టీమిండియా లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ సింపుల్‌గా, కూల్‌గా ఉంటారు. అలాంటోళ్లు షాంపెయిన్తో రచ్చ రచ్చ చేస్తారని ఊహించగలరా? కానీ ఇది జరిగింది.
Nidhan
భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాల్లోకెల్లా అది ఎంతో ప్రత్యేకం. మన టీమ్ దశ, దిశను మార్చిన గెలుపది. భయం అనేది లేకుండా ఎలా ఆడాలో నేర్పిన మ్యాచ్ అది. ప్రపంచ క్రికెట్‌పై భారత్ గుత్తాధిపత్యం చెలాయించగలదనే నమ్మకం అక్కడి నుంచే మొదలైంది. ఎంతటి జట్టు అడ్డొచ్చినా ఓడిస్తూ వెళ్లిపోవడమే.. ఇక నో ఫియర్ అనే భరోసాను ఇచ్చిన ఆ విజయం 2001లో వచ్చింది. క్రికెట్ మీద పెత్తనాన్ని నడిపిస్తూ ప్రతి జట్టును చిత్తుగా ఓడిస్తూ పోతున్న ఆస్ట్రేలియా ఆ ఏడాది భారత పర్యటనకు వచ్చింది. టీమిండియాను ఈజీగా ఓడించి మరో సిరీస్‌ను ఖాతాలో వేసుకుందామని భావించింది. అయితే కోల్‌కతాలోని ఈడన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు కంగారూలకు పీడకలగా మిగిలింది. ఆ మ్యాచ్ భారత క్రికెట్లో చరిత్రాత్మక విజయంగా నిలిచిపోయింది. ఆ గెలుపు తర్వాత లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ నెవర్ బిఫోర్ సెలబ్రేషన్స్‌తో రెచ్చిపోయారు.
గంగూలీ అగ్రెసివ్‌గా కనిపిస్తాడు గానీ ద్రవిడ్, సచిన్ మాత్రం ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. ఎంత పెద్ద విజయం సాధించినా పైకి చూపించరు. ఒకవేళ ఓటమి ఎదురైనా లోలోపలే బాధపడతారు. సచిన్, ద్రవిడ్ పెద్దగా సెలబ్రేషన్ చేసుకోవడం ఎప్పుడూ చూసుండరు. కానీ 2001లో ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తుగా ఓడించిన తర్వాత వీళ్లు ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకవైపు సచిన్, గంగూలీ.. మరోవైపు ద్రవిడ్ షాంపెయిన్ బాటిల్స్‌తో హల్చల్ చేశారు. షాంపెయిన్ను సహచర ప్లేయర్ల మీద పడేలా చల్లుతూ, గట్టిగా కేకలు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. వీళ్ల సందడితో డ్రెస్సింగ్ రూమ్ మొత్తం పండుగ వాతావరణంతో కనిపించింది. ఇది జరిగి 23 ఏళ్లు అవుతోంది. అప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉండే ద్రవిడ్, సచిన్‌లు.. దాదాతో కలసి ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని.. ద్రవిడ్, సచిన్‌ల సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయని అంటున్నారు. ఓడిపోతామనే మ్యాచ్‌లో ఆసీస్ లాంటి ఛాంపియన్ జట్టును చిత్తుగా ఓడించడమంటే మాటలా? వాళ్లు సెలబ్రేట్ చేసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదని చెబుతున్నారు. ఇక, చరిత్రాత్మక ఈడెన్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన భారత్ 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియాను ఆసీస్ ఫాలో ఆన్‌కు ఆహ్వానించడంతో మ్యాచ్ చేజారిందని అంతా అనుకున్నారు. కానీ ద్రవిడ్ (180), లక్షణ్ (281) లైఫ్ టైమ్ ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఆసీస్ 212 పరుగులకే ఆలౌట్ అయింది. 171 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో మన జట్టు నెగ్గింది.
ఇదీ చదవండి: క్రికెట్లో ఐసీసీ కొత్త రూల్స్.. ఇక కెప్టెన్లకు కష్టాలు తప్పవు!
A RARE SIGHT IN WORLD CRICKET…!!!
The celebrations from Rahul Dravid after the historic 2001 Eden Gardens win on this day 23 years ago. You’ll hardly see Dravid celebrating like this. ❤️pic.twitter.com/1rM5YfcrrD
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2024