Nidhan
క్రికెట్లో ఒక్కో బ్యాటర్ ఒక్కో విధంగా ఆడతారు. ముఖ్యంగా బిగ్ షాట్స్ కొట్టడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అయితే కొన్ని ప్రత్యేకమైన షాట్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఓ ముంబై బ్యాటర్ బాదిన ఓ భారీ సిక్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
క్రికెట్లో ఒక్కో బ్యాటర్ ఒక్కో విధంగా ఆడతారు. ముఖ్యంగా బిగ్ షాట్స్ కొట్టడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అయితే కొన్ని ప్రత్యేకమైన షాట్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఓ ముంబై బ్యాటర్ బాదిన ఓ భారీ సిక్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Nidhan
క్రికెట్లో ఒక్కో బ్యాట్స్మన్ది ఒక్కో శైలి. ఒక్కొక్కరు ఒక్కోలా ఆడతారు. ముఖ్యంగా బిగ్ షాట్స్ కొట్టడంలో కొంతమంది సంప్రదాయకంగా ఆడితే.. మరికొందరు మాత్రం డిఫరెంట్‌గా ఆడతారు. కొందరు బ్యాటర్లు బుక్ షాట్స్‌ను కాకుండా ప్రత్యేకమైన షాట్లను కూడా కనిపెడుతుంటారు. దిల్షాన్ దిల్ స్కూప్, ధోని హెలికాప్టర్, సూర్యకుమార్ సుప్లా షాట్స్ అలాంటివే. బ్యాటర్లు ఇలా డిఫరెంట్ షాట్స్ ఆడినప్పుడు ఏం చేయాలో బౌలర్లకు తోచదు. గుడ్‌లెంగ్త్‌లో బాల్ వేసినా ఇలాంటి షాట్లతో బాల్‌ను బౌండరీకి తరలిస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. టీమిండియా లెజెండ్ ధోని ఇలా ప్రత్యేకమైన షాట్లు ఆడటంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. యార్కర్ బాల్‌ను కూడా రెప్పపాటులో సిక్స్‌గా మలచడం అతడి స్టైల్. అయితే నో లుక్ సిక్స్ కూడా మాహీ స్పెషాలిటీ. అలాంటి ధోని షాట్‌ను ఓ కుర్ర క్రికెటర్ కాపీ కొట్టాడు. ఇది ఎస్ఏ 20 లీగ్‌లో జరిగింది.
ఎస్ఏ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్ ఓ అద్భుతమైన సిక్స్ కొట్టాడు. గుడ్ లెంగ్త్‌లో పడి వస్తున్న బాల్‌ను నిల్చున్న దగ్గర నుంచే లెగ్ సైడ్ దిశగా భారీ సిక్స్‌గా మలిచాడు. అతడి బలానికి బాల్ వెళ్లి స్టాండ్స్‌లో పడింది. అయితే బాల్ వేస్తున్నప్పుడు మాత్రమే చూసిన బ్రేవిస్.. షాట్ కొట్టాక దాని వైపు చూడలేదు. షాట్ కొట్టాక తల పైకి ఎత్తకుండా అలాగే ముందుకొచ్చాడు. బంతి ప్రేక్షకుల్లో పడ్డాక దాని వైపు చూశాడు. ఇది చూసిన నెటిజన్స్ అలా ఎలా కొట్టావ్ సామి అని ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి నో లుక్ షాట్స్ ఆడటంలో ఎంఎస్ ధోని ఫేమస్. అప్పట్లో భారత జట్టు తరఫున నో లుక్ షాట్స్ బాదుతూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేవాడు. తాను సిక్స్ బాదితే ఎక్కడ పడిందో బౌలర్లు, ఫీల్డర్లు చూడాలి గానీ తనకు అవనసం లేదనేలా ఆ షాట్స్ ఉండేవి. ఇప్పుడు అలాంటి ఓ సిక్స్‌తో మాహీని తలపించాడు బ్రేవిస్. ఈ మ్యాచ్‌లో ఎంఐసీటీ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ కేప్‌టౌన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. సూపర్బ్ ఫామ్‌లో ఉన్న ర్యాన్ రికెల్టన్ (90)తో పాటు బ్రేవిస్ (66 నాటౌట్) రాణించడంతో కేప్‌టౌన్ భారీ స్కోరు చేసింది. నో లుక్ సిక్స్ కొట్టిన బ్రేవిస్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 భారీ సిక్సులు ఉండటం విశేషం. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 214 పరుగులే చేయగలిగింది. కౌల్ వెరీనే (116) సెంచరీతో చెలరేగినా లాభం లేకపోయింది. మిగతా బ్యాటర్లంతా ఫెయిలవడంతో ప్రిటోరియాకు ఓటమి తప్పలేదు. ఇక, ఎస్ఏ20లో దుమ్మురేపుతున్న డెవాల్డ్ బ్రేవిస్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. మరి.. బ్రేవిస్ కొట్టిన నో లుక్ షాట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A NO-LOOK SIX BY DEWALD BREVIS ….!!!! 🔥pic.twitter.com/rURTI6gYNx
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 1, 2024