iDreamPost
android-app
ios-app

Kagiso Rabada: వీడియో: మిడిల్‌ వికెట్‌ అడ్డంగా విరిగింది! ఈ బాల్‌ను ఆడే బ్యాటర్‌ ఉన్నాడా?

  • Published Feb 02, 2024 | 2:43 PM Updated Updated Feb 02, 2024 | 2:43 PM

ప్రస్తుత వరల్డ్ క్రికెట్​లో డేంజరస్ బౌలర్లలో సౌతాఫ్రికా స్టార్ కగిసో రబాడ ఒకడు. గత కొన్నేళ్లుగా నిలకడగా వికెట్లు తీస్తూ బ్యాటర్లకు సింహస్వప్నంగా మారాడు రబాడ.

ప్రస్తుత వరల్డ్ క్రికెట్​లో డేంజరస్ బౌలర్లలో సౌతాఫ్రికా స్టార్ కగిసో రబాడ ఒకడు. గత కొన్నేళ్లుగా నిలకడగా వికెట్లు తీస్తూ బ్యాటర్లకు సింహస్వప్నంగా మారాడు రబాడ.

  • Published Feb 02, 2024 | 2:43 PMUpdated Feb 02, 2024 | 2:43 PM
Kagiso Rabada: వీడియో: మిడిల్‌ వికెట్‌ అడ్డంగా విరిగింది! ఈ బాల్‌ను ఆడే బ్యాటర్‌ ఉన్నాడా?

క్రికెట్​లో ఇప్పుడు ఎక్కడ చూసినా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లే దర్శనమిస్తున్నాయి. సంప్రదాయ టెస్టులను పక్కనబెడితే.. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్​లో ఫ్లాట్ పిచ్​లను తయారు చేస్తున్నారు. వన్డేల కంటే టీ20ల్లో ఇది మరీ ఎక్కువ. భారీ స్కోర్లు నమోదవ్వాలి, ప్రేక్షకుల్ని బాగా ఎంటర్​టైన్ చేయాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లను రూపొందిస్తున్నారు. దీని వల్ల బౌలర్లకు చాలా ఇబ్బంది అవుతోంది. ముఖ్యంగా పేసర్లకు పిచ్ నుంచి సహకారం దొరక్కపోవడంతో తేలిపోతున్నారు. అయితే పిచ్​లు ఎలా ఉన్నా.. క్రీజులో ఉన్న బ్యాటర్ ఎవరైనా సరే పట్టించుకోకుండా వికెట్లు తీసే బౌలర్లు కొందరు ఉన్నారు. అందులో ఒకడు సౌతాఫ్రికా స్టీడ్​స్టర్ కగిసో రబాడ. 140 కిలోమీట్లరకు తగ్గని స్పీడ్​తో, మంచి వేరియేషన్స్​తో, పర్ఫెక్ట్ లెంగ్త్​లో బాల్స్ వేస్తూ బ్యాటర్ల గుండెల్లో దడ పుట్టిస్తుంటాడు రబాడ. మరోసారి ఓ అద్భుతమైన బంతితో తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడతను.

పేస్​తో పాటు పిచ్ నుంచి స్వింగ్​ను రాబట్టడంలో ఎక్స్​పర్ట్ అయిన రబాడను ఎదుర్కోవడం ఎంతటి బ్యాటర్​కైనా కష్టమే. ముఖ్యంగా అతడి యార్కర్లను ఫేస్ చేయాలంటే మహామహా బ్యాట్స్​మెన్ కూడా భయపడతారు. వికెట్లు, బ్యాటింగ్ క్రీజు, బ్యాటర్ కాళ్లను టార్గెట్ చేసుకొని బంతుల్ని బుల్లెట్ స్పీడ్​తో విసిరే రబాడ మరోసారి ఓ డెడ్లీ యార్కర్​తో వైరల్ అయ్యాడు. ఎస్​ఏ 20 లీగ్​లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచులో అద్భుతమైన బంతితో స్టార్ బ్యాటర్ విల్ జాక్స్ (26)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన రబాడ వికెట్లను టార్గెట్ చేసుకొని తక్కువ ఎత్తులో బాల్ వేశాడు. దీంతో క్రీజులో నుంచి ఎడమ వైపునకు జరిగిన జాక్స్.. రూమ్ క్రియేట్ చేసుకొని దాన్ని ఆఫ్ సైడ్ బౌండరీకి తరలిద్దామనుకున్నాడు. కానీ బుల్లెట్​ వేగంతో దూసుకొచ్చిన బంతి మిడిల్ వికెట్​ను తాకింది. దెబ్బకు మిడిల్ స్టంప్ అడ్డంగా విరిగింది.

రబాడ వేసిన బాల్​కు మిడిల్ స్టంప్ విరిగిపోగా.. బెయిల్స్ ఎగిరి బ్యాటింగ్ క్రీజు దగ్గర పడ్డాయి. దీంతో బిత్తరపోయిన విల్ జాక్స్ ఏం అయ్యిందో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు. ఇదేం బాల్ రా సామి అనుకొని షాకయ్యాడు. డెడ్లీ యార్కర్ వేసిన రబాడ మాత్రం సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ఫాలో త్రూలో అలా పరిగెత్తుతూ రాగా.. మిగిలిన టీమ్​మేట్స్ అతడ్ని మెచ్చుకున్నారు. రబాడ వేసిన బాల్ చూసిన నెటిజన్స్.. ఇలాంటి బాల్ ఆడే బ్యాటర్ ఎవరూ లేరని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్​టౌన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 248 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ 8 వికెట్లకు 214 పరుగులు మాత్రమే చేయగలిగింది. విల్ జాక్స్ వికెట్ తీసిన రబాడ మరో వికెట్ కూడా పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి.. రబాడ వేసిన యార్కర్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Shoaib Bashir: 20 ఏళ్ల కుర్రాడు.. రోహిత్‌నే బోల్తా కొట్టించాడు! ఎవరీ షోయబ్‌ బషీర్‌?