iDreamPost

Shoaib Bashir: 20 ఏళ్ల కుర్రాడు.. రోహిత్‌నే బోల్తా కొట్టించాడు! ఎవరీ షోయబ్‌ బషీర్‌?

  • Published Feb 02, 2024 | 12:10 PMUpdated Feb 02, 2024 | 12:10 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతోంది. తొలుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కేవలం 14 రన్స్‌ చేసి అవుట్‌ అయ్యాడు. రోహిత్‌ను అవుట్‌ చేసినోడు కేవలం 20 ఏళ్ల కుర్ర బౌలర్‌. అతని బ్యాగ్రౌండ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతోంది. తొలుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కేవలం 14 రన్స్‌ చేసి అవుట్‌ అయ్యాడు. రోహిత్‌ను అవుట్‌ చేసినోడు కేవలం 20 ఏళ్ల కుర్ర బౌలర్‌. అతని బ్యాగ్రౌండ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 02, 2024 | 12:10 PMUpdated Feb 02, 2024 | 12:10 PM
Shoaib Bashir: 20 ఏళ్ల కుర్రాడు.. రోహిత్‌నే బోల్తా కొట్టించాడు! ఎవరీ షోయబ్‌ బషీర్‌?

విశాఖపట్నంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్ట్‌ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ను ఆచీతూచీ ఆరంభించారు. జైస్వాల్‌ బౌండరీలు బాదుతున్నా.. రోహిత్‌ మాత్రం మరీ నిదానంగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓ 20 ఏళ్ల కుర్రాడిని బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ కుర్ర స్పిన్నర్‌ తన తొలి మ్యాచ్‌లోనే దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మను అవుట్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి.. తన తొలి వికెట్‌ రోహిత్‌ శర్మ లాంటి స్టార్‌ బ్యాటర్‌ను అవుట్‌ చేయడంతో ఆ కుర్రాడి ఆనందాన్ని హద్దులు లేవు.

ఇంతకీ ఆ కుర్ర స్పిన్నర్ ఎవరంటే.. షోయబ్‌ బషీర్‌. ఈ మ్యాచ్‌తోనే ఇంగ్లండ్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన బషీర్‌.. ఆ ఓవర్‌ మూడో బంతికి రోహిత్‌ శర్మను బోల్తా కొట్టించాడు. బషీర్‌ బాల్‌ను అర్థం చేసుకోలేకపోయిన రోహిత్‌.. బ్యాక్‌వార్డ్‌ స్క్వౌర్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో.. 41 బంతులాడిన రోహిత్‌ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. విశాఖపట్నంలో రోహిత్‌ ఆడిన చివరి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేయడం విశేషం. అలాంటి ఆటగాడిని ఈ 20 ఏళ్ల క్విక్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అవుట్‌ చేయడం విశేషంగా మారింది. దీంతో.. అసలు ఎవరీ బషీర్‌? ఏంటి ఇతని బ్యాగ్రౌండ్‌ అని క్రికెట్‌ అభిమానులు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. అతని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

షోయబ్‌ బషీర్‌ పాకిస్థాన్‌ సంతతికి చెందిన వ్యక్తి. 2003 అక్టోబర్‌ 13న జన్మించిన బషీర్‌.. ఇంగ్లండ్‌లోనే పుట్టి పెరిగాడు. అతని పూర్వీకులు ఎప్పుడో ఇంగ్లండ్‌ వచ్చి స్థిరపడిపోయారు. ఇక బషీర్‌ అంకుల్‌ గిల్డ్‌ఫోర్డ్ సిటీ క్రికెట్ క్లబ్ తరఫున క్రికెట్‌ ఆడేవాడు. అతని ప్రొత్సాహంతోనే బషీర్‌ క్రికెట్‌ వైపు అడుగులేశాడు. 6.4 అడుగుల భారీ ఎత్తున్నా.. అతని స్పీడ్‌ బౌలర్‌గా కాకుండా.. స్పిన్‌ బౌలర్‌గా మారాడు. అదే అతనికి త్వరగా అవకాశాలు తెచ్చిపెట్టిందని చెప్పాలి. గిల్డ్‌ఫోర్డ్ సిటీ క్రికెట్ క్లబ్ తరఫున, అలాగే ఏజ్‌ గ్రూప్‌ క్రికిట్‌ ఆడిన బషీర్‌.. 2022లో సోమర్‌సెట్‌ తరఫున బరిలోకి దిగాడు. అలాగే టీ20 బ్లాస్ట్‌ కూడా ఆడాడు. దేశవాళి క్రికెట్‌లో తక్కువ మ్యాచ్‌లే ఆడినా.. మంచి ప్రదర్శన కనబర్చడంతో బషీర్‌కు ఇంగ్లండ్‌ జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది.

స్పిన్‌ బౌలింగ్‌తో పాటు లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ కూడా చేయగలడు బషీర్‌. తన కెరీర్‌లో ఇప్పటి వరకు 6 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన బషీర్‌ 10 వికెట్లు పడగొట్టాడు. 3.30 ఎకానమీ బౌలింగ్‌ వేసేవాడు. అలాగే లిస్ట్‌-ఏలో 7 మ్యాచ్‌లు ఆడి.. 3 వికెట్లు పడగొట్టాడు. దేశవాళి క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేకపోయినా.. ఇండియాలో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయని అతన్ని జట్టులోకి తీసుకున్నారు. కాగా, ఇండియాకి వచ్చే క్రమంలో బషీర్‌కు వీసా సమస్యలు కూడా ఎదురయ్యాయి. అతను పాకిస్థాన్‌ సంతతికి చెందిన వ్యక్తి కావడంతో కాస్త ఆలస్యంగా అతని వీసా మంజూరైంది. ఈ విషయంపై రోహిత్‌ శర్మ కూడా స్పందించాడు. నేను వీసా మంజూరు చేయలేను కదా అంటూ సెటైర్లు వేశాడు. ఇప్పుడు అదే బౌలర్‌.. రోహిత్‌ను అవుట్‌ చేయడం గమనార్హం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి