iDreamPost

17 ఏళ్ల సెహ్వాగ్-జాఫర్ ల రికార్డు బద్దలు కొట్టిన రోహిత్-జైస్వాల్ జోడీ!

  • Author Soma Sekhar Published - 02:51 PM, Fri - 14 July 23
  • Author Soma Sekhar Published - 02:51 PM, Fri - 14 July 23
17 ఏళ్ల సెహ్వాగ్-జాఫర్ ల రికార్డు బద్దలు కొట్టిన రోహిత్-జైస్వాల్ జోడీ!

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్ లో చెలరేగింది. టీమిండియా ఓపెనర్ల ద్వయం కెప్టెన్ రోహిత్ శర్మ, అరంగేట్ర కుర్రాడు యశస్వీ జైస్వాల్ సెంచరీలతో కదంతొక్కారు. దాంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. క్రీజ్ లో చిచ్చర పిడుగు జైస్వాల్ 143 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో విరాట్ కోహ్లీ 36 పరుగులతో నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్-జైస్వాల్ జోడీ 17 ఏళ్ల సెహ్వాగ్-జాఫర్ ల రికార్డును బద్దలు కొట్టింది. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, తొలి టెస్ట్ ఆడుతున్న యువ కెరటం యశస్వీ జైస్వాల్ సెంచరీలతో చెలరేగారు. ఈ జోడీ విండీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ.. తొలి వికెట్ కు 229 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో పలు రికార్డులు బద్దలు కొట్టారు ఈ ద్వయం. ముఖ్యంగా జైస్వాల్ చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. తొలి మ్యాచే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా షాట్లు ఆడాడు ఈ యువకెరటం. 350 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లతో 143 పరుగులు చేశాడు జైస్వాల్. రోహిత్ 103 పరుగులు చేసి అతనజే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ఈ క్రమంలోనే ఈ జోడీ 17 సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్న సెహ్వాగ్-జాఫర్ ల రికార్డును తాజాగా బద్దలు కొట్టింది. టెస్టుల్లో వెస్టిండీస్ పై భారత ఓపెనర్లు నెలకొల్పిన అతిపెద్ద భాగస్వామ్యం కూడా ఇదే. గతంలో 2006 లో సెహ్వాగ్-జాఫర్ ల జోడీ తొలి వికెట్ కు 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇప్పటి వరకు ఈ రికార్డు చెక్కుచెదరలేదు. తాజాగా ఈ రికార్డు ను బద్దలు కొట్టారు రోహిత్-జైస్వాల్ జోడీ. ఇక జైస్వాల్ ఈ రికార్డుతో పాటుగా పలు రికార్డులు నమోదు చేశాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాటర్ గా.. తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ చేసిన భారత మూడో ఓపెనర్ గా చరిత్ర సృష్టించాడుద యశస్వీ జైస్వాల్. మరి ఇన్ని రికార్డులు సాధించిన యశస్వీ జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: పరిగెత్తుకెళ్లి రోహిత్‌ను హగ్‌ చేసుకున్న జైస్వాల్‌! కోహ్లీ రియాక్షన్‌ చూడండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి