iDreamPost
android-app
ios-app

పరిగెత్తుకెళ్లి రోహిత్‌ను హగ్‌ చేసుకున్న జైస్వాల్‌! కోహ్లీ రియాక్షన్‌ చూడండి

  • Published Jul 14, 2023 | 1:35 PM Updated Updated Jul 14, 2023 | 6:42 PM
  • Published Jul 14, 2023 | 1:35 PMUpdated Jul 14, 2023 | 6:42 PM
పరిగెత్తుకెళ్లి రోహిత్‌ను హగ్‌ చేసుకున్న జైస్వాల్‌! కోహ్లీ రియాక్షన్‌ చూడండి

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ జట్టును భారత బౌలర్లు 150 పరుగులకే ఆలౌట్‌ చేయగా.. తొలి ఇన్నింగ్స్‌ ఆడేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ-యశస్వి జైస్వాల్‌ అద్భుత ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ సెంచరీలో చెలరేగిపోయారు. ఈ టెస్టుతోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జైస్వాల్‌ తొలుత సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ వెంటనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం టెస్టుల్లో తన 10వ సెంచరీని సాధించాడు.

అయితే.. ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌ సెంచరీ చేసిన తర్వాత ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆడుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ చేస్తే కెరీర్‌కు అంతకంటే గొప్ప ఆరంభం ఉండదు. ఏ క్రికెటర్‌కైనా డెబ్యూ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ఒక కల. ఆ కలను జైస్వాల్‌ నిజం చేసుకున్నాడు. భారత్‌ తరఫున తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేసిన 17వ ఆటగాడిగా నిలిచాడు. అయితే.. ఆ సంతోషంలో తన బ్యాటింగ్‌ పార్ట్నర్‌ అయిన రోహిత్‌ శర్మను పరిగెత్తుకెళ్లి జైస్వాల్‌ కౌగిలించుకున్నాడు. ఈ సీన్‌ క్రికెట్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఒక సీనియర్‌ ప్లేయర్‌, అందులోనా టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మతో మంచి భాగస్వామ్యం నమోదు చేసి.. అతని సమక్షంలో సెంచరీ చేయడంతో జైస్వాల్‌ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది. ఆ ఆనందాన్ని రోహిత్‌కు హగ్‌ ఇచ్చి పంచుకున్నాడు జైస్వాల్‌. కానీ, అదే సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో విరాట్‌ కోహ్లీ మాత్రం ఆశ్చర్యంగా చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అయ్యాయి. జైస్వాల్‌ సెంచరీ మార్క్‌ అందుకోగానే చప్పట్లతో అభినందించిన కోహ్లీ.. జైస్వాల్‌, రోహిత్‌ను హగ్‌ చేసుకోగానే ఫేస్‌ మారిపోయిందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి కోహ్లీ అలా ఎందుకు రియాక్ట్‌ అయ్యాడో తెలియదు కానీ, క్రికెట్‌ అభిమానులు మాత్రం రోహిత్‌ శర్మకు జైస్వాల్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కోహ్లీకి నచ్చలేదని నెటిజన్లు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 80 బంతులాడి ఫస్ట్‌ బౌండరీ కొట్టిన కోహ్లీ! రియాక్షన్‌ మాత్రం సెంచరీ చేసినట్టు..

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş