iDreamPost
android-app
ios-app

IPL 2024: SRHతో మ్యాచ్.. చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ!

  • Published Mar 26, 2024 | 10:07 PM Updated Updated Mar 26, 2024 | 10:07 PM

సన్ రైజర్స్ తో మ్యాచ్ కు ముందు చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో ఉన్నాడు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. మరి ఆ హిస్టరీ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

సన్ రైజర్స్ తో మ్యాచ్ కు ముందు చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో ఉన్నాడు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. మరి ఆ హిస్టరీ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024: SRHతో మ్యాచ్.. చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ!

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం(మార్చి 27) ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ ఆడనుంది ముంబై ఇండియన్స్ టీమ్. అయితే ఈ మ్యాచ్ రోహిత్ కు చాలా ప్రత్యేకమైనది. మరి దానికి కారణాలు ఏంటి? హిట్ మ్యాన్ నెలకొల్పబోయే ఆ రికార్డు ఏంటి? తెలుసుకుందాం పదండి.

రోహిత్ శర్మ.. టీమిండియా క్రికెట్ తో పాటుగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లో ప్రత్యేక ముద్రను వేశాడు. ఇక ఐపీఎల్ లో రోహిత్ కు తిరుగులేని రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్ టీమ్ కు ఐదు టైటిళ్లు అందించిన సారథిగా ఘనమైన రికార్డు ఉంది. తాజాగా సన్ రైజర్స్ తో మ్యాచ్ ఆడటం ద్వారా మరో చరిత్రను సృష్టించనున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే? ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున 200 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. కాగా.. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కూడా ముంబై తరఫున 200 మ్యాచ్ లు ఆడిన దాఖలాలు లేవు.

2011 సీజన్ నుంచి ముంబై టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు హిట్ మ్యాన్. ఇప్పటి వరకు 199 మ్యాచ్ లు ఆడాడు. సన్ రైజర్స్ తో ఆడే మ్యాచ్ తో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. ముంబై తరఫున 199 మ్యాచ్ ల్లో 5084 రన్స్ చేసి.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరఫున అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు రోహిత్. తొలి రెండు స్థానాల్లో ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ 239 మ్యాచ్ లు, చెన్నై తరఫున 221 మ్యాచ్ లు ఆడి రెండో ప్లేస్ లో ఉన్నాడు ఎంఎస్ ధోని. మరి తన స్పెషల్ మ్యాచ్ లో హిట్ మ్యాన్ ఏ రేంజ్ లో చెలరేగుతాబో చూడాలి.

ఇదికూడా చదవండి: CSK vs GT: గుజరాత్ బౌలర్లపై దూబే దండయాత్ర.. కేవలం 21 బంతుల్లోనే..