SNP
Rohit Sharma, IPL 2024: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. రానున్న ఐపీఎల్ 2024 సీజన్‌కు దూరం కాబోతున్నాడనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి అందులో నిజమెంతా? దూరంగా అవ్వడానికి కారణాలేంటి? అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
Rohit Sharma, IPL 2024: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. రానున్న ఐపీఎల్ 2024 సీజన్‌కు దూరం కాబోతున్నాడనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి అందులో నిజమెంతా? దూరంగా అవ్వడానికి కారణాలేంటి? అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నీ 17వ సీజన్ మొదలు కానుంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి ఇవ్వనుంది. ఎప్పటిలాగే ఈ సీజన్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాకిస్తూ.. రోహిత్ శర్మ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌కు రోహిత్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.
ముంబై ఇండియన్స్‌ను కెప్టెన్‌గా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు రోహిత్ శర్మ. అలాంటి ప్లేయర్‌ను ఉన్నపళంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు. పైగా అతను టీమిండియాకు కెప్టెన్‌గా ఉండగా ఒక ఫ్రాంచైజ్ తనను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్ కూడా బాధపడినట్లు ఉన్నాడు. అందుకే ఇప్పటి వరకు కెప్టెన్సీ మార్పుపై ఒక్కసారి కూడా స్పందించలేదు. కానీ, ముంబైకి నేరుగా షాకిచ్చాడు. ఏకంగా సీజన్ మొత్తానికి దూరంగా ఉండటమే కాకుండా.. వచ్చే సీజన్‌లో ఏకంగా టీమ్‌నే వదిలేసే ఆలోచనలో రోహిత్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఈ సారి సీజన్‌కు రోహిత్ దూరం అవ్వడానికి కూడా బలమైన కారణం ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. మార్చి 7 నుంచి ప్రారంభం కానున్న చివరి టెస్ట్‌లో కూడా రోహిత్ ఆడనున్నాడు. కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ, పాండ్యా లాంటి ప్లేయర్లు వివిధ కారణాలతో టెస్టులకు దూరంగా ఉన్నా.. రోహిత్ మాత్రం జట్టును అంటిపెట్టుకుని, కుర్రాళ్లతో కలిసి ఇంగ్లండ్‌ను కుమ్మేస్తున్నాడు. కానీ, ఐదు టెస్టుల సిరీస్ ఆడి అలసిపోయిన రోహిత్ ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. పైగా ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఉండటం, ఆ టోర్నీలో రోహితే టీమ్‌ను నడిపించాల్సి ఉండటంతో.. ఐపీఎల్‌కు దూరంగా ఉంటే.. ఈ టెస్ట్ సిరీస్ అలసట నుంచి రికవరీ అయి.. టీ20 వరల్డ్ కప్‌లో ఫ్రెష్‌గా దిగొచ్చని రోహిత్ భావిస్తున్నాడు.
రోహిత్ లాంటి దిగ్గజ ప్లేయర్ ఒక్క ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉంటే వచ్చే నష్టమేమి లేదు. జరిగే నష్టమల్లా ముంబై ఇండియన్స్ టీమ్‌కే. ఈ విషయంలో రోహిత్‌ను ప్రశ్నించడానికి కూడా ఏం ఉండదు. ఎందుకు దేశం కోసం నిర్విరామంగా క్రికెట్ ఆడి, టీ20 వరల్డ్ కప్ కోసం ఆలోచించి.. ఐపీఎల్‌కు దూరంగా ఉండటం మంచి విషయమే. పైగా బోలెడంతా డబ్బును కాదని, నేషనల్ డ్యూటీ కోసం రోహిత్ త్యాగం చేస్తున్నాడనే సపోర్ట్‌ను కూడా పొందుతాడు. అయితే తన అండర్‌లో రోహిత్ ఆడాలని ఆశపడుతున్న హార్ధిక్ పాండ్యాకు చెంపపెట్టులా ఉంటుంది. అయితే.. ఐపీఎల్‌కు దూరం అవుతున్నాని పెట్టిన పోస్ట్‌ను రోహిత్ కొన్ని నిమిషాల్లోనే డిలీట్ చేశాడు. మరి ఈ విషయంపై మనసు మార్చుకున్నాడా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
IPL won’t be the same without Captain Rohit Sharma 🥺💔#IPL2024 pic.twitter.com/tiakem0RSn
— ً (@Ro45Goat) February 22, 2024