iDreamPost
android-app
ios-app

రోహిత్​పై డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ విషయంలో భయపెడుతున్నాడంటూ..!

  • Author singhj Published - 10:07 AM, Thu - 26 October 23

వరల్డ్ కప్​లో టీమిండియాను సక్సెస్​ఫుల్​గా నడిపిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అలాంటి హిట్​మ్యాన్​పై మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక విషయంలో అతడు అందర్నీ భయపెడుతున్నాడని అన్నాడు.

వరల్డ్ కప్​లో టీమిండియాను సక్సెస్​ఫుల్​గా నడిపిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అలాంటి హిట్​మ్యాన్​పై మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక విషయంలో అతడు అందర్నీ భయపెడుతున్నాడని అన్నాడు.

  • Author singhj Published - 10:07 AM, Thu - 26 October 23
రోహిత్​పై డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ విషయంలో భయపెడుతున్నాడంటూ..!

వన్డే వరల్డ్‌ కప్​లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ ఫుల్ జోష్​లో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఫేవరెట్స్​తో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి డేంజరస్ టీమ్స్​ను కూడా చిత్తు చేసింది రోహిత్ సేన. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ నెగ్గిన భారత్.. వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్​లో ఫస్ట్ ప్లేసులో ఉంది. కివీస్​తో మ్యాచ్​ తర్వాత గ్యాప్ దొరకడంతో ప్లేయర్లు రెస్ట్ తీసుకున్నారు. ఇంగ్లండ్​తో మ్యాచ్​కు మరింత ఫ్రెష్​గా, ప్రిపేర్డ్​గా ఉండేందుకు ఇది హెల్ప్ అయింది. భారత ప్లేయర్స్​తో పాటు కోచింగ్ స్టాఫ్​ కూడా ధర్మశాలలో ఉండి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట్ హల్​చల్ చేశాయి.

ఇంగ్లండ్​తో మ్యాచ్​లో గెలుపుపై ఫోకస్ పెట్టాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ వరల్డ్ కప్​లో సూపర్ ఫామ్​లో ఉన్నాడు హిట్​మ్యాన్. బ్యాట్​తో అద్భుతంగా రాణిస్తూ యంగ్​స్టర్స్​కు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఫీల్డ్​లో బౌలర్లకు అవసరమైన టైమ్​లో సలహాలు, సూచనలు ఇస్తూ కెప్టెన్​గా సపోర్ట్​గా ఉంటున్నాడు. మెగా టోర్నీలో బ్యాటింగ్, కెప్టెన్సీలో ఫుల్ మార్క్స్ వేయించుకున్న రోహిత్.. ఇదే జోరును కొనసాగిస్తే భారత్ ఖాతాలో మరో ప్రపంచ కప్ వచ్చి చేరడం ఖాయంలా కనిపిస్తోంది. టీమిండియాను సక్సెస్​ఫుల్​గా నడిపిస్తున్న రోహిత్​ను సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల్లో ముంచెత్తాడు.

‘రోహిత్ భారత్​కు శుభారంభాలు అందిస్తున్నాడు. అలవోకగా సిక్సులు బాదే అతడి సామర్థ్యం అద్భుతం. బౌలర్ల నుంచి రెస్పెక్ట్​ను అతడు డిమాండ్ చేస్తాడు. మెగా టోర్నీలో బ్యాటింగ్ విషయంలో అతడు ప్రత్యర్థి జట్లను భయపెడుతున్నాడు. ఆసీస్ దిగ్గజం మ్యాథ్యూ హేడెన్​ను హిట్​మ్యాన్ గుర్తు చేస్తున్నాడు. హేడెన్​లాగే రోహిత్ కూడా క్రీజులో నిలబడి బాల్​ను గట్టిగా బాదుతున్నాడు. రోహిత్ ఆరంభంలో ఫాస్ట్​గా ఆడుతూ టీమ్​కు మంచి ఓపెనింగ్ ఇస్తున్నాడు. ఈ వరల్డ్ కప్​లో అతడి బ్యాటింగ్ సూపర్బ్​గా ఉంది. కెప్టెన్​గా ఐపీఎల్​లో ముంబైను రోహిత్ ఎంత బాగా నడిపించాడో చూశాం. ఇప్పుడు వరల్డ్‌ కప్​లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఈసారి కప్పును టీమిండియా గెలుచుకోవడం ఖాయం’ అని డివిలియర్స్ జోస్యం చెప్పాడు. మరి.. రోహిత్​ను ఉద్దేశించి ఏబీడీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీ కాదు.. వరల్డ్ కప్​లో అందర్నీ భయపెట్టిస్తున్న బ్యాటర్ అతనే!