iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ శర్మ పెట్టుకున్న ఈ వాచ్ ధరెంతో తెలుసా? వామ్మో.. అన్ని కోట్లా?

  • Published May 04, 2024 | 9:34 AM Updated Updated May 04, 2024 | 9:34 AM

టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టును ప్రకటించే సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ లగ్జరీ వాచ్ ను ధరించాడు. దాని ధరెంతో తెలుసా? తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.

టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టును ప్రకటించే సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ లగ్జరీ వాచ్ ను ధరించాడు. దాని ధరెంతో తెలుసా? తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.

Rohit Sharma: రోహిత్ శర్మ పెట్టుకున్న ఈ వాచ్ ధరెంతో తెలుసా? వామ్మో.. అన్ని కోట్లా?

సెలబ్రిటీ లైఫ్ అంటే రిచ్ గా ఉంటుందని అందరికి తెలిసిందే. సదరు సెలబ్రిటీలు వాడే చెప్పుల దగ్గర నుంచి బంగ్లాల వరకు అన్నీ ఖరీదైనవే. ఇక ప్రముఖుల ఇంట్లో కుప్పలు తెప్పలుగా ఖరీదైన వస్తువులు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఎక్కువగా కార్లు, బైక్స్, వాచ్ లు ఉంటాయి. ఇక వాటి ధరలు చూస్తే.. మనం నోరెళ్లబెట్టాల్సిందే. తాాజాగా టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టును ప్రకటించే సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ లగ్జరీ వాచ్ ను ధరించాడు. దాని ధరెంతో తెలుసా? తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.

టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టును ప్రకటించడానికి ఓ ప్రెస్ కాన్పరెన్స్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ లగ్జరీ వాచ్ ను ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ వాచ్ ఏ కంపెనీ? దాని ధరెంత? అని తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఆ ఖరీదైన వాచ్ కు సంబంధించి వివరాల్లోకి వెళితే.. రోహిత్ పెట్టుకున్నవాచ్ ధర అక్షరాలా రూ. 2.17 కోట్లుగా తెలుస్తోంది. పటెక్ ఫిలిప్ నాటిలస్ ప్లాటినం 5711 రకానికి చెందిన ఈ వాచ్ లు ప్రముఖులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎంతో స్టైలిష్ తో పాటుగా లగ్జరీగా ఉండటంతో.. సెలబ్రిటీలు ఎక్కువగా వీటిని ప్రాధాన్యత ఇస్తుంటారు.

అయితే ఈ వాచ్ ను ఇంతకు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సైతం పెట్టుకుని కనిపించాడు. అయితే ఆ వాచ్ ధర దీని కంటే ఎక్కవ. పాండ్యా పెట్టుకున్న ఆ రకం వాచ్ ధర ఏకంగా రూ. 5 కోట్లు ఉంటుందట. కాగా.. ఈ ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఆడిన 11 మ్యాచ్ ల్లో 326 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 24 పరుగులతో ఓడిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by SportsTiger (@sportstiger_official)