Somesekhar
14 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్ లో డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. శుబ్ మన్ గిల్ కు రోహిత్ శర్మకు మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల రనౌట్ రూపంలో హిట్ మ్యాన్ వెనుదిరగాల్సి వచ్చింది.
14 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్ లో డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. శుబ్ మన్ గిల్ కు రోహిత్ శర్మకు మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల రనౌట్ రూపంలో హిట్ మ్యాన్ వెనుదిరగాల్సి వచ్చింది.
Somesekhar
ఆఫ్గానిస్తాన్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్లోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఆఫ్గాన్ జట్టు. 14 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్ లో డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ కు రోహిత్ శర్మకు మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల రనౌట్ రూపంలో హిట్ మ్యాన్ వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో ఇన్నింగ్స్ రెండో బంతికే ఆఫ్గాన్ కు భారీ బ్రేక్ త్రూ లభించింది. మరి ఈ విషయంలో తప్పు గిల్ దా? లేక రోహిత్ శర్మదా? ఇప్పుడు చూద్దాం.
దాదాపు 14 నెలల తర్వాత టీ20ల్లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మకు తొలి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురైంది. అతడు ఎదుర్కొన్న రెండు బంతుల్లోనే పెవిలియన్ కు చేరాడు. అసలేం జరిగింది అంటే? ఆఫ్గాన్ విధించిన 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. చాలా కాలం తర్వాత పొట్టి ఫార్మాట్ లోకి అడుగుపెట్టాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక తొలి ఓవర్ ను ఆఫ్గాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ ప్రారంభించాడు. ఇన్నింగ్స్ రెండో బంతిని రోహిత్ స్ట్రైట్ గా కొట్టి.. రన్ కు పరిగెత్తుకు వచ్చాడు. అయితే బాల్ ఫీల్డర్ చేతిలో పడటంతో..బంతినే చూస్తూ.. శుబ్ మన్ గిల్ రన్ కోసం వెళ్లలేదు. అదీకాక రన్ కోసం వస్తున్న రోహిత్ ను సైతం అతడు గమనించలేదు. అప్పటికే రోహిత్ బౌలర్ వైపు క్రీజ్ లోకి వచ్చాడు. గిల్ మాత్రం బాల్ ను చూస్తూ అక్కడే ఉన్నాడు. దీంతో ఫీల్డర్ డైరెక్ట్ గా వికెట్ కీపర్ కు బాల్ అందివ్వడంతో.. టీమిండియా కెప్టెన్ రనౌట్ గా వెనుదిరగక తప్పలేదు. తీవ్ర నిరాశలో ఉన్న రోహిత్ కోపంతో గిల్ వైపు చూస్తూ.. పెవిలియన్ చేరాడు.
వాస్తవానికి గిల్ రోహిత్ పిలుపు అందుకుని రన్ కు వెళ్తే పరుగు వచ్చేదే. కానీ అతడు బాల్ వైపే చూస్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్య మిస్ అండర్ స్టాండింగ్ వల్ల పాపం రోహిత్ బలైయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు తప్పు ఎవరిదో చెప్పుకొస్తున్నారు. ఇక ఈ రనౌట్ లో తప్పు ముమ్మాటికి శుబ్ మన్ గిల్ దే అంటున్నారు నెటిజన్లు. అతడు అనవసరంగా రన్ కు వెళ్లకుండా అక్కడే ఉన్నాడు.. అంటూ గిల్ ను విమర్శిస్తున్నారు. అయితే రోహిత్ అవుటైన కసితో ఫోర్లతో విరుచుకుపడ్డాడు గిల్. 12 బంతుల్లో 5 ఫోర్లతో 23 రన్స్ చేసి మంచి టచ్ లోకి వచ్చినట్లు కనిపించిన గిల్ ను ముజీబ్ బోల్తాకొట్టించాడు. భారీ షాట్ కు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో తిలక్ వర్మ(22), శివమ్ దుబే(21) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 8.3 ఓవర్లకి 2 వికెట్ల నష్టానికి 72 రన్స్ చేసింది టీమిండియా. మరి ఈ రనౌట్ లో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit sharma abusing Gill for his own mistake 💔
Youngsters are in trouble under Rohit captaincy🙏pic.twitter.com/YMA7o8Ojjn
— M. (@IconicKohIi) January 11, 2024