iDreamPost
android-app
ios-app

SA vs AFG: వరల్డ్ కప్ ఫైనల్ కు సౌతాఫ్రికా! ఆఫ్గాన్ ఆశలు ఆవిరి..

  • Published Jun 27, 2024 | 8:41 AM Updated Updated Jun 27, 2024 | 8:41 AM

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు చేరాలన్న ఆఫ్గానిస్తాన్ కల.. కలగానే మిగిలిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో 9 వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైంది ఆఫ్గాన్.

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు చేరాలన్న ఆఫ్గానిస్తాన్ కల.. కలగానే మిగిలిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో 9 వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైంది ఆఫ్గాన్.

SA vs AFG: వరల్డ్ కప్ ఫైనల్ కు సౌతాఫ్రికా! ఆఫ్గాన్ ఆశలు ఆవిరి..

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరాలన్న ఆఫ్గానిస్తాన్ ఆశలు ఆవిరి అయ్యాయి. సౌతాఫ్రికాతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో.. 56 పరుగులకే ఆఫ్గాన్ కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లు ఊహించని రీతిలో చెలరేగడంతో.. ఎప్పుడూ శుభారంభాలు ఇచ్చే ఓపెనర్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఇక 56 పరుగుల స్వల్ప టార్గెట్ ను సఫారీ టీమ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి దంచికొట్టింది.

టీ20 ప్రపంచ కప్ లో ఆఫ్గానిస్తాన్ కథ ముగిసింది. అద్భుత ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం ఆకట్టుకుంది. కానీ ముఖ్యమైన మ్యాచ్ లో ప్రోటీస్ బౌలర్లకు దాసోహం అయ్యింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజ్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించలేదు. అంతలా దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగిపోయారు. మార్కో జాన్సన్, తంబ్రైజ్ షంషీ, నోర్ట్జే, రబాడ సమష్టిగా రాణించడంతో.. 11.5 ఓవర్లలో 56 రన్స్ కే ఆఫ్గాన్ కుప్పకూలింది. ఒమర్జాయ్ 10 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాన్సన్, షంషీ తలా 3 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 57 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన సఫారీ టీమ్ కు రెండో ఓవర్లోనే షాకిచ్చాడు ఫజల్ హక్ ఫారూఖీ. ఓపెనర్ క్వింటన్ డికాక్(5)ను పెవిలియన్ కు పంపి.. ఆఫ్గాన్ శిబిరంలో ఆశలు రేపాడు. కానీ హెండ్రిక్(29*), మార్క్రమ్(23*) ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 8.5 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించారు. దాంతో వరల్డ్ కప్ ఫైనల్ కు చేరి.. కప్ కొట్టాలని కలలు కన్న ఆఫ్గానిస్తాన్ ఆశలు ఆవిరి అయ్యాయి.