SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆఫ్ఘాన్‌పై సెంచరీతో చెలరేగాడు. కేవలం 69 బంతుల్లోనే 121 పరుగులు చేశాడు. అయితే.. ఈ సెంచరీ తర్వాత హార్ధిక్ పాండ్యా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరి దానికి దీనికి లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆఫ్ఘాన్‌పై సెంచరీతో చెలరేగాడు. కేవలం 69 బంతుల్లోనే 121 పరుగులు చేశాడు. అయితే.. ఈ సెంచరీ తర్వాత హార్ధిక్ పాండ్యా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరి దానికి దీనికి లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో ఏకంగా రెండు సూపర్ ఓవర్లు నిర్వహించాల్సి వచ్చింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. ఆఫ్ఘాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఆరంభంలో వెంటవెంటనే వికెట్లు పడటంతో రోహిత్ శర్మ చాలా నెమ్మదిగా ఆడాడు. 22 పరుగులకే 4 వికెట్లు పడిపోవడంతో.. రింకూతో కలిసి ముందుగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ఆ తర్వాత తన ఒరిజినల్ హిట్టింగ్‌ను బయటికి తీస్తూ.. విధ్వంసం సృష్టించాడు. కేవలం 69 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సులతో 121 పరుగులు చేశాడు. ఇవి కాకుండా.. సూపర్ ఓవర్స్‌లో 3 సిక్సులు, ఒక ఫోర్ తో అదరగొట్టాడు.
దీంతో.. ఒక్కసారిగా రోహిత్ శర్మ పేరు ఇండియన్ క్రికెట్‌లో మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే మరోసారి టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆఫ్ఘాన్‌పై రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసి.. కొంతమంది రోహిత్ శర్మ అభిమానులు పాండ్యాను, ముంబై ఇండియన్స్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతంగా ఆడిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత టీ20 క్రికెట్‌లో కొనసాగుతాడా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వీడి.. ముంబై ఇండియన్స్‌లోకి తిరిగి రావడం, ఆ తర్వాత ముంబై యాజమాన్యం పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం పెను దూమారమే రేపింది.
అసలు ముంబైకి ఐదు సార్లు కప్పు అందించిన సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మను తొలగించి.. పాండ్యాకు ఎలా కెప్టెన్సీ ఇస్తారని రోహిత్ అభిమానులతో పాటు సగటు క్రికెట్ అభిమాని సైతం ఆగ్రహం వ్యక్తం చేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబైని అన్‌ఫాలో చేశారు. ఆ తర్వాత ఆఫ్ఘాన్‌తో సిరీస్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. దీంతో రోహిత్ అభిమానులు ఎంతో సంతోషించారు. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సెంచరీతో చెలరేగడంతో.. ముంబై ఇండియన్స్‌కు ఇప్పుడు ఎవరు కావాలో తేల్చుకోవాలని సోషల్ మీడియా వేదికగా కొంతమంది క్రికెట్ అభిమానులు సవాలు విసురుతున్నాడు. రోహిత్ ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో మరోసారి నిరూపితమైందని అంటున్నారు. మరి రోహిత్ ఇన్నింగ్స్‌తో పాటు అతని అభిమానులు పాండ్యా, ముంబైకి చేస్తున్న సవాల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Official – Rohit Sharma himself confirmed his participation in t20 World cup as captain .
2min silence for Hardik pandya and his gym videos 😭#INDvsAFG | #RohitSharma | #Hitmanpic.twitter.com/72oP8y3u4s
— Immy|| 🇮🇳 (@TotallyImro45) January 18, 2024