ఆ ముగ్గురు యంగ్​స్టర్స్​పై ఫోకస్ పెట్టాం.. మాకు వాళ్లు చాలా ముఖ్యం: రోహిత్

Rohit Sharma, Yashasvi Jaiswal, Sarfaraz Khan, IND vs BAN: బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​కు ఇంకా రెండ్రోజుల సమయం మాత్రమే ఉంది. ఐద్రోజుల కిందే ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న చెన్నైకి చేరుకున్న టీమిండియా క్రికెటర్లు.. నెట్స్​లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు.

Rohit Sharma, Yashasvi Jaiswal, Sarfaraz Khan, IND vs BAN: బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​కు ఇంకా రెండ్రోజుల సమయం మాత్రమే ఉంది. ఐద్రోజుల కిందే ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న చెన్నైకి చేరుకున్న టీమిండియా క్రికెటర్లు.. నెట్స్​లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు.

బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​కు ఇంకా రెండ్రోజుల సమయం మాత్రమే ఉంది. ఐద్రోజుల కిందే ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న చెన్నైలోని చెపాక్ స్టేడియానికి చేరుకున్న టీమిండియా క్రికెటర్లు.. నెట్స్​లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. బంగ్లాను లైట్ తీసుకోకుండా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు. బ్యాటర్లు గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. బౌలర్లు కూడా సుదీర్ఘ స్పెల్స్ వేస్తూ టెస్టులకు తగ్గట్లు తమను తాము సెట్ చేసుకుంటూ దర్శనమిచ్చారు. ఫీల్డింగ్​లో అందరూ రెండు గ్రూప్స్​గా డివైడ్ అయి పోటాపోటీగా క్యాచులు అందుకుంటూ, త్రోలు విసురుతూ అలరించారు. ఇక, సిరీస్​ ఓపెనర్​కు ఇంకా రెండ్రోజుల టైమ్ ఉండటంతో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నాడు. బ్యాటింగ్ యూనిట్ గురించి అందులో యంగ్​స్టర్స్​ రోల్ గురించి అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు.

యశస్వి జైస్వాల్​తో పాటు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ వంటి కుర్ర బ్యాటర్లు టీమిండియాకు ఎంతో ముఖ్యమని చెప్పాడు రోహిత్. వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామని తెలిపాడు. ఆ ముగ్గుర్నీ మరింత సానబెట్టాల్సిన అవసరం ఉందన్నాడు హిట్​మ్యాన్. పరిస్థితులకు తగ్గట్లు ఆడటంలో ఆ ముగ్గురూ సమర్థులని మెచ్చుకున్నాడు. టఫ్ సిచ్యువేషన్స్​లో సర్ఫరాజ్​, జైస్వాల్, జురెల్ బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయని.. వాళ్లు దేనికీ భయపడకుండా ఆడటం తనను ఆకట్టుకుందని పేర్కొన్నాడు భారత సారథి. ప్రెస్ కాన్ఫరెన్స్​లో స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గురించి కూడా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రాహుల్​ సామర్థ్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. అతడేంటో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చాడు హిట్​మ్యాన్. అతడి బ్యాటింగ్ టాలెంట్ మీద ఎవరూ డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నాడు.

‘రాహుల్ ఎంత క్వాలిటీ క్రికెటర్ అనేది అందరికీ తెలుసు. అతడికి ఎంతో టాలెంట్ ఉంది. కఠిన సమయాల్లో టీమ్​ను ఆదుకోవడంలో ఎక్స్​పర్ట్. అతడు లాంగ్ ఫార్మాట్​లో కమ్​బ్యాక్ ఇచ్చినప్పటి నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. సౌతాఫ్రికాలో ఓ టెస్ట్​లో సెంచరీ బాదాడు. హైదరాబాద్​లోనూ 80కి పైగా పరుగులు చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ గాయం వల్ల అతడు జట్టుకు దూరమయ్యాడు. టెస్టుల్లో అతడు రాణించడు అని చెప్పడం కరెక్ట్ కాదు. అతడు లాంగ్ ఫార్మాట్​లో తప్పకుండా అదరగొడతాడు’ అని రోహిత్ స్పష్టం చేశాడు. తమకు ప్రతి సిరీస్ ఇంపార్టెంట్ అని చెప్పిన హిట్​మ్యాన్.. ఒక ట్రోఫీ గెలిచాం కాబట్టి రిలాక్స్ అయిపోవాలనేది తన మైండ్​సెట్ కాదన్నాడు. టీమిండియా ఆడే ప్రతి సిరీస్, ప్రతి మ్యాచ్ ముఖ్యమని.. అన్నింటా విజయబావుటా ఎగరేస్తామని పేర్కొన్నాడు.

Show comments