iDreamPost
android-app
ios-app

R. Ashwin: ఆ రికార్డు బద్దలు కొట్టాలనుకున్నాను.. కానీ నా వల్ల కాలేదు: అశ్విన్

  • Published Sep 17, 2024 | 12:01 PM Updated Updated Sep 17, 2024 | 12:01 PM

Ravichandran Ashwin: ఓ ఘనతను సాధించాలనుకున్నానని, కానీ అది నా వల్ల కాలేదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Ravichandran Ashwin: ఓ ఘనతను సాధించాలనుకున్నానని, కానీ అది నా వల్ల కాలేదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

R. Ashwin: ఆ రికార్డు బద్దలు కొట్టాలనుకున్నాను.. కానీ నా వల్ల కాలేదు: అశ్విన్

ప్రపంచ క్రికెట్ లో తమకంటూ ఓ ప్రత్యేకత చాటుకోవాలని, జట్టుకు విజయాలు అందించడంతో పాటుగా రికార్డుల మీద రికార్డులు కొట్టాలని ప్రతి ఒక్క ఆటగాడికి ఉంటుంది. అయితే కొంత మంది వీటిల్లో విజయం సాధించగా.. మరికొంత మంది ఆటగాళ్లు మాత్రం కొన్ని రికార్డ్స్ ను సాధించాలనుకోని, వాటిని బ్రేక్ చేయలేక అలాగే ఉండిపోతుంటారు. నేను కూడా అలాంటి ఓ ఘనతను సాధించాలనుకున్నానని, కానీ అది నా వల్ల కాలేదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మరి అశ్విన్ బద్దలు కొట్టాలనుకున్న ఆ రికార్డు ఏంటి? చూద్దాం పదండి.

రవిచంద్రన్ అశ్విన్.. భారత క్రికెట్ లోనే కాక, ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ స్పిన్నర్ గా పేరుగాంచాడు. ఇక తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. అంతే కాదు.. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే(619) తర్వాత 516 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బంతితోనే కాదు.. బ్యాట్ తోనూ అశ్విన్ మ్యాజిక్ చేసిన సందర్బాలు ఉన్నాయి. కాగా.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ స్టార్ స్పిన్నర్ తన తీరని కోరిక గురించి వెల్లడించాడు. తాను ఓ రికార్డును సాధించాలనుకున్నానని, కానీ అది సాధ్యం కాలేదని చెప్పుకొచ్చాడు. “నేను ఒకే ఓవర్లో 6 సిక్సులు కొట్టాలనుకున్నాను. కానీ అది నా వల్ల కాలేదు” అని ఈ వెటరన్ స్పిన్నర్ తెలిపాడు.

కాగా.. నేడు(సెప్టెంబర్ 17) రవిచంద్రన్ అశ్విన్ తన 38వ పుట్టినరోజును జరుపుకొంటున్నాడు. ఈ సందర్బంగా బీసీసీఐ అతడికి బర్త్ డే విషెస్ చెబుతూ.. ఓ పోస్ట్ చేసింది. ఇక గత కొంత కాలంగా వన్డే క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్న అశ్విన్.. టెస్ట్ క్రికెట్ లో మాత్రం కీలక సభ్యుడిగా ఉంటూ వస్తున్నాడు. త్వరలోనే ప్రారంభం కాబోయే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టాడు. ఇక అశ్విన్ కెరీర్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 281 ఇంటర్ నేషనల్ మ్యాచ్ లు ఆడి 744 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 36 సార్లు ఐదు వికెట్లు సాధించడంతో పాటుగా బ్యాట్ తో 5 శతకాలు కూడా నమోదు చేశాడు. మరి ఎన్నో ఘనతలు సాధించిన అశ్విన్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టాలన్న కల మాత్రం నెరవేరలేదు. మరి భవిష్యత్ లో అయినా.. అతడి కల నెరవేరుతుందో, లేదో చూడాలి.