iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ విషయంలో అది నా అదృష్టం.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Published Jan 28, 2024 | 1:28 PM Updated Updated Jan 29, 2024 | 3:49 PM

విరాట్ కోహ్లీపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ. ఆ విషయంలో కోహ్లీని చూసి నేటి తరం యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవాలని సూచించాడు. అలాగే కోహ్లీ విషయంలో అది నా అదృష్టం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

విరాట్ కోహ్లీపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ. ఆ విషయంలో కోహ్లీని చూసి నేటి తరం యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవాలని సూచించాడు. అలాగే కోహ్లీ విషయంలో అది నా అదృష్టం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Virat Kohli: కోహ్లీ విషయంలో అది నా అదృష్టం.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ.. దశాబ్ద కాలంగా టీమిండియాకు వెన్నముకగా నిలుస్తూ, తిరుగులేని విజయాలను అందిస్తున్నారు. వీరిద్దరు టీమ్ లో ఉంటే ప్రత్యర్థికి వణుకుపుట్టాల్సిందే. అయితే వీరి మధ్య అభిప్రాయా భేదాలు వచ్చాయని, దానికి కారణం కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించి జట్టు పగ్గాలను రోహిత్ కు అందించడమే అని చాలామంది చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ అవాస్తవాలని తామిద్దరం మంచి స్నేహితులమని, ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకుంటూ జట్టు విజయానికి తోడ్పడుతున్నమని ఇద్దరూ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా విరాట్ కోహ్లీపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ. ఆ విషయంలో కోహ్లీని చూసి నేటి తరం యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవాలని రోహిత్ సూచించాడు.

విరాట్ కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. నేటి తరం కుర్రాళ్లు కింగ్ కోహ్లీ నుంచి ఎంతో నేర్చుకోవాలని సూచించాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ..”ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ లాంటి ఫ్యాషనేట్, డెడికేషన్ ఆటగాడిని నేను ఇంతవరకు చూడలేదు. అతడు ఎప్పుడు పరుగులు చేయాలనే ఆకలితోనే ఉంటాడు. తన టీమ్ కు బెస్ట్ అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తుంటాడు. కోహ్లీ డెడికేషన్, ఫ్యాషన్ నుంచి నేటి తరం యువ క్రికెటర్లు ఎంతో నేర్చుకోవాలి. ఇక నేను ఇంత దగ్గరగా కోహ్లీని చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రోహిత్ భాయ్.

rohit comments about kohli

ఇక విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ పై కూడా ఈ సందర్భంగా మాట్లాడాడు హిట్ మ్యాన్. సాధారణంగానే ప్రపంచ క్రికెట్ లో ఫిట్ నెస్ అనగానే మనందరికి ముందుగా గుర్తుకువచ్చేది కింగ్ కోహ్లీనే. అతడి ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇదే విషయాన్ని రోహిత్ మరోసారి చెప్పుకొచ్చాడు. విరాట్ ఇంత వరకు NCAలో గాయాలతో జాయిన్ అవ్వలేదు. ఎంతో మంది ప్లేయర్లు గాయాలతో ఎన్సీఏలో జాయిన్ అయ్యి చికిత్స తీసుకున్నారు. కానీ కింగ్ కోహ్లీ మాత్రం అక్కడి వెళ్లడం జరగలేదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు అతడి ఫిట్ నెస్ లెవెల్స్ అంటూ కితాబిచ్చాడు హిట్ మ్యాన్. విరాట్ లో ఉన్న ఇన్ని విషయాలు యంగ్ ప్లేయర్లందరూ చూసి నేర్చుకోవాలని వారికి సలహా ఇచ్చాడు టీమిండియా సారథి. మరి విరాట్ కోహ్లీపై రోహిత్ చేసిన ఈ వ్యాఖ్యలు మీకేవింధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.