iDreamPost
android-app
ios-app

రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. క్రికెటర్ గా ఇలా ఉండటానికి కారణమదే అంటూ..!

  • Author Soma Sekhar Published - 04:21 PM, Wed - 1 November 23

క్రికెటర్ గా తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటో వెల్లడించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అది నాకెంతో స్పెషల్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రికెటర్ గా తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటో వెల్లడించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అది నాకెంతో స్పెషల్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 04:21 PM, Wed - 1 November 23
రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. క్రికెటర్ గా ఇలా ఉండటానికి కారణమదే అంటూ..!

రోహిత్ శర్మ.. వరల్డ్ కప్ లో టీమిండియాను ముందుండి నడపడమే కాకుండా.. బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్నాడు. దీంతో ప్రపంచ కప్ లో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ ల్లో గెలిచి.. సెమీస్ బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకుంది. ఇదిలా ఉండగా.. గురువారం శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రోహిత్.. క్రికెటర్ గా తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటో వెల్లడించాడు. అది నాకెంతో స్పెషల్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు.

ప్రపంచ కప్ లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. వరల్డ్ కప్ లో భాగంగా.. గురువారం శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ. తాను క్రికెటర్ గా ఉండటానికి కారణం ఏంటో తెలిపాడు. ప్రెస్ మీట్ లో రోహిత్ మాట్లాడుతూ..”నేనిప్పుడు క్రికెటర్ గా ఈ స్థాయిలో ఉండటానికి కారణం వాంఖడే స్టేడియమే. అందుకే నాకు గ్రౌండ్ స్పెషల్. ప్రతీ విషయం ఇక్కడి నుంచే నేర్చుకుంటున్నా.

ఇక వాంఖడేలో ముంబై వాసుల క్రికెట్ అభిమానాన్ని కొలవడం అసాధ్యం. గ్రౌండ్ లో ఉత్తరం వైపు ఉండే స్టాండ్ ఎంతో ప్రసిద్ది. అభిమానులు అటువైపు నుంచే ఎక్కువ వస్తారు” అంటూ తనకు వాంఖడే స్టేడియంతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశాడు. ఇదిలా ఉండగా.. రోహిత్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఏడాది 21 వన్డే ఇన్నింగ్స్ ల్లో 56 సిక్స్ లు బాది.. గేల్ తో సమంగా నిలిచాడు. గేల్ కూడా 2019లో 15 ఇన్నింగ్స్ ల్లోనే 56 సిక్స్ లు బాదాడు. దీంతో మరో మూడు సిక్స్ లు బాదితే.. ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ గా రికార్డు నెలకొల్పుతాడు రోహిత్.