iDreamPost
android-app
ios-app

Rohit Sharma: వీడియో: IPL లో ఆ టీమ్ కు కెప్టెన్ గా చేయాలనుంది.. రోహిత్ షాకింగ్ కామెంట్స్!

  • Published Dec 23, 2023 | 3:54 PM Updated Updated Dec 23, 2023 | 3:54 PM

ఐపీఎల్ లో ఆ జట్టుకు కెప్టెన్ గా చేయాలనుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు హిట్ మ్యాన్. మరి ఇంతకీ రోహిత్ కెప్టెన్ గా చేయాలనుకున్న ఫ్రాంచైజీ ఏది? ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ లో ఆ జట్టుకు కెప్టెన్ గా చేయాలనుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు హిట్ మ్యాన్. మరి ఇంతకీ రోహిత్ కెప్టెన్ గా చేయాలనుకున్న ఫ్రాంచైజీ ఏది? ఇప్పుడు తెలుసుకుందాం.

Rohit Sharma: వీడియో: IPL లో ఆ టీమ్ కు కెప్టెన్ గా చేయాలనుంది.. రోహిత్ షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కంటే ముందుగానే పలు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తోంది. ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మను కాదని క్యాష్ ఆన్ ట్రేడింగ్ ద్వారా జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ పగ్గాలను అందించింది. ఈ విషయం రోహిత్ ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అదీకాక ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయంపై రోహిత్ సైతం అసంతృప్తిలో ఉన్నాడని, త్వరలోనే వేరే జట్టులోకి వెళ్తాడన్న వార్తలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కాగా.. రోహిత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రాయబారాలు జరిపిందన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఐపీఎల్ లో ఆ జట్టుకు కెప్టెన్ గా చేయాలనుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఇంతకీ రోహిత్ కెప్టెన్ గా చేయాలనుకున్న ఫ్రాంచైజీ ఏది? ఇప్పుడు తెలుసుకుందాం.

ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర సంతృప్తిలో ఉన్నాడు రోహిత్ శర్మ. తనను కాదని జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించడంతో.. హిట్ మ్యాన్ తో పాటు, అతడి అభిమానులు కూడా ఫైర్ మీదున్నారు. ఇక రోహిత్ ను పక్కన పెట్టడంతో.. అతడు పక్క ఫ్రాంచైజీల వైపు చూస్తున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఫిబ్రవరి 22 వరకు ప్లేయర్లను ట్రేడింగ్ చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడింగ్ కోసం రోహిత్ ను సంప్రదించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలం ముగిసిన వెంటనే ముంబై ఇండియన్స్ ఓ ప్రకటన చేసింది. తమ టీమ్ నుంచి ఏ ఆటగాళ్లు బయటకి వెళ్లడం లేదంటూ.. స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే రోహిత్ శర్మ మాట్లాడిన ఓ పాత వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రోహిత్ ను ఐపీఎల్ లో సీఎస్కే, ఆర్సీబీలకు కాకుండా మీకు ఏ జట్టుకు కెప్టెన్ గా చేయాలనుంది అని యాంకర్ ప్రశ్నించింది. దానికి సమాధానంగా రోహిత్ మాట్లాడుతూ..”ఈడెన్ గార్డెన్ గ్రౌండ్ నా ఫేవరెట్ గ్రౌండ్. కేకేఆర్ హోం గ్రౌండ్ కూడా ఇదే కావడంతోనే ఆ జట్టుకు కెప్టెన్ గా చేయాలని కోరుకుంటున్నాను” అంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు రోహిత్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. ఈడెన్ గార్డెన్స్ వేదికగానే రోహిత్ టెస్టుల్లోకి 2013లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే 177 పరుగులతో సత్తాచాటాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో నిజంగానే రోహిత్ మరో ఫ్రాంచైజీలోకి వెళ్తాడా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by @rohirat__77._