iDreamPost
android-app
ios-app

Rohit Sharma: ఫ్యూచర్​ గోల్స్​పై రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! ఏమన్నాడంటే?

  • Published Aug 21, 2024 | 10:20 PM Updated Updated Aug 21, 2024 | 10:20 PM

టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా నడిపిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ జట్టును టాప్​కు తీసుకొచ్చిన హిట్​మ్యాన్.. ఇటీవలే వరల్డ్ కప్ దాహం కూడా తీర్చాడు. అలాంటోడు ఫ్యూచర్ గోల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా నడిపిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ జట్టును టాప్​కు తీసుకొచ్చిన హిట్​మ్యాన్.. ఇటీవలే వరల్డ్ కప్ దాహం కూడా తీర్చాడు. అలాంటోడు ఫ్యూచర్ గోల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Published Aug 21, 2024 | 10:20 PMUpdated Aug 21, 2024 | 10:20 PM
Rohit Sharma: ఫ్యూచర్​ గోల్స్​పై రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! ఏమన్నాడంటే?

టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా నడిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ నుంచి సారథ్య పగ్గాలు అందుకున్న హిట్​మ్యాన్.. అన్ని ఫార్మాట్లలోనూ జట్టును టాప్​కు తీసుకొచ్చాడు. ఇటీవలే వరల్డ్ కప్ దాహం కూడా తీర్చాడు. చాన్నాళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ కప్​ను భారత్ పట్టేసింది. అతడి సారథ్యంలోనే టెస్టుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్స్, వన్డేల్లో వరల్డ్ కప్-2023 ఫైనల్స్​కు చేరుకుంది టీమిండియా. ఈ రెండు సార్లు కప్పు మిస్ అయినా పొట్టి ప్రపంచ కప్-2024తో ఐసీసీ ట్రోఫీని అందుకోవాలనే డ్రీమ్ నెరవేరింది. మున్ముందు భారత్​కు మరిన్ని కప్పులు అందించాలని పట్టుదలతో ఉన్నాడు హిట్​మ్యాన్. ఈ విషయంపై తాజాగా అతడు రియాక్ట్ అయ్యాడు. టీమిండియా ఫ్యూచర్ గోల్స్ ఏంటో రివీల్ చేశాడు.

సియట్ క్రికెట్ అవార్డ్స్ ఈవెంట్​కు రోహిత్ చీఫ్​ గెస్ట్​గా అటెండ్ అయ్యాడు. ఈ ఈవెంట్ కోసం వచ్చిన హిట్​మ్యాన్​ను నిర్వాహకులు దగ్గరుండి స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. అనంతరం అతడ్ని యాంకర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. దీనికి రోహిత్ తనదైన శైలిలో జవాబులు చెప్పాడు. భారత జట్టు ఫ్యూచర్ గోల్స్ ఏంటనే క్వశ్చన్​కు.. ఇంతటితో ఏదీ అయిపోలేదని, ఇప్పుడే స్టార్ట్ అయిందన్నాడు. తాము సాధించాల్సినది ఇంకా చాలా ఉందన్నాడు రోహిత్. ప్రతి సిరీస్, టోర్నీలో తమను తాము మరింత పుష్ చేస్తూ పోతామన్నాడు. జట్టు పరంగా తాము అఛీవ్ అవ్వాల్సింది ఇంకా చాలా ఉందన్నాడు. తననే కాదు.. టీమ్​లోని ఏ ప్లేయర్​ను అడిగినా ఇదే మాట చెబుతారన్నాడు. రాబోయే కొన్నేళ్లు టీమిండియాకు చాలా కీలకమన్నాడు హిట్​మ్యాన్.

టీ20 వరల్డ్ కప్​ గెలిచిన క్షణాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయని.. ట్రోఫీని నెగ్గడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు రోహిత్. ఆ ఆనందం, అనుభూతిని మాటల్లో చెప్పలేనన్నాడు. ప్రపంచ కప్​ను మళ్లీ ఇక్కడికి తీసుకురావడం గొప్పగా అనిపిస్తోందన్నాడు. ట్రోఫీని చేతబట్టి అభిమానులతో కలసి సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నాడు హిట్​మ్యాన్. ఇక, ఈ అవార్డుల వేడుకలో భారత సారథికి ఓ పురస్కారం దక్కింది. సియట్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రోహిత్ గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్​కు అతడితో పాటు టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అటెండ్ అయ్యాడు. ఆయన్ను లైఫ్ టైమ్ అఛీవ్​మెంట్ అవార్డు వరించింది.