Somesekhar
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ ఘోర ఓటమిపై మ్యాచ్ ముగిసిన తర్వాత స్పందించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మా ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయని చెబుతూ.. విచారం వ్యక్తం చేశాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ ఘోర ఓటమిపై మ్యాచ్ ముగిసిన తర్వాత స్పందించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మా ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయని చెబుతూ.. విచారం వ్యక్తం చేశాడు.
Somesekhar
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సఫారీ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాలనుకున్న భారత్ కు గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా విఫలం అయ్యారు. ఒక్కరిద్దరు మినహా ఎవ్వరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ ముగిసిన తర్వాత స్పందించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మా ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయని చెబుతూ.. విచారం వ్యక్తం చేశాడు.
సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఓటమిపై మ్యాచ్ అనంతరం మాట్లాడాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ..”ఈ మ్యాచ్ లో మా ఆట విజయం దిశగా సాగలేదు. మా బ్యాటింగ్ చాలా చెత్తగా ఉంది. అయితే కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే దీన్ని మేం ఉపయోగించుకోలేకపోయాం. టెస్టు మ్యాచ్ గెలవాలంటే జట్టులో ప్లేయర్లంతా సమష్టిగా రాణించాలి, కానీ ఈరోజు మేం దారుణంగా విఫలం అయ్యాం. ఇక సఫారీ బౌలర్లు మాపై అనుక్షణం ఒత్తిడి తీసుకొచ్చారు. అదీకాక ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ప్లేయర్ల బలాబలాలను సరిగ్గా అంచనా వేయలేకపోయాం” అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా.. టీమిండియా ప్లేయర్లలో చాలా మంది తొలిసారి సౌతాఫ్రికాకు వచ్చారని ఓటమికి ఇది కూడా ఓ కారణమని చెప్పుకొచ్చాడు రోహిత్. అయితే ఓటమికి సాకులు వెతుక్కుంటూ కూర్చోమని, పుంజుకుని రెండో మ్యాచ్ లో విజయం సాధించడానికి ప్రయత్నిస్తామని హిట్ మ్యాన్ తెలిపాడు. కాగా.. తొలి ఇన్నింగ్స్ లో 5 పరుగులు చేసిన రోహిత్, రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా తొలి ఇన్నిగ్స్ లో 245 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 408 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. మరి ఓటమిపై రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Here is how Indian skipper Rohit Sharma and Player of the Match (POTM) Dean Elgar reacted to South Africa’s remarkable victory in the first Test against India in Cent pic.twitter.com/wnw6Q2o6x6
— CricTracker (@Cricketracker) December 28, 2023