Nidhan
కెప్టెన్సీ మార్పు అంశంతో ముంబై ఇండియన్స్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మను తీసేసి హార్దిక్ పాండ్యాను కొత్త సారథిగా నియమించడం వివాదస్పదంగా మారింది. అయితే సరిగ్గా గమనిస్తే ఆ టీమ్ బిగ్ మిస్టేక్ చేసినట్లు కనిపిస్తోంది.
కెప్టెన్సీ మార్పు అంశంతో ముంబై ఇండియన్స్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మను తీసేసి హార్దిక్ పాండ్యాను కొత్త సారథిగా నియమించడం వివాదస్పదంగా మారింది. అయితే సరిగ్గా గమనిస్తే ఆ టీమ్ బిగ్ మిస్టేక్ చేసినట్లు కనిపిస్తోంది.
Nidhan
క్రికెట్లో టీమ్ నిండా ఎంత మంది స్టార్ ప్లేయర్లు ఉన్నా వాళ్లను నడిపించే సరైన కెప్టెన్ ఉండాలి. అప్పుడే ఆ జట్టు బలం మరింత రెట్టింపు అవుతుంది. కరెర్ట్ టైమ్‌కు కరెక్ట్ డెసిజన్స్ తీసుకునే కెప్టెన్ ఉంటే ఆ జట్టుకు తిరుగుండదు. ఒకవేళ స్టార్ ఆటగాళ్లు జట్టులో లేకపోయినా అందుబాటులో ఉన్న వనరుల్ని చక్కగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. అలాంటి సారథి దొరికితే ట్రోఫీలు అవే కాళ్ల దగ్గరకు వస్తాయి. దీనికి ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ లాంటి వారిని బెస్ట్ ఎగ్జాంపుల్స్‌గా చెప్పొచ్చు. ధోని ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ సక్సెస్ అయ్యాడు. కానీ హిట్‌మ్యాన్ ఐపీఎల్ సారథిగా హిట్టయ్యాడు. ముంబై ఇండియన్స్‌కు ఏకంగా 5 ట్రోఫీలు అందించాడు. అలాంటోడ్ని కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది ఎంఐ. అయితే ఇది ముంబై చేసిన బిగ్ మిస్టేక్ అనే చెప్పాలి.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ను ఇటీవల ప్లేయర్ల ట్రేడింగ్‌లో భారీ ధర వెచ్చించి మరీ తెచ్చుకుంది ముంబై. ఆ తర్వాత అతడ్ని కెప్టెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. రోహిత్ లాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్‌ను కాదని మరీ నెక్స్ట్ సీజన్‌కు టీమ్ బాధ్యతలు అతడికి అప్పజెప్పింది. సారథిగా గుజరాత్‌ను ఒకసారి ఛాంపియన్‌గా నిలపడం, మరోసారి ఫైనల్‌కు చేర్చడంతో పాండ్యా తోపు అనుకొని తెచ్చుకుంది ముంబై. కానీ హార్దిక్‌ను నడిపించినోడ్ని మాత్రం మర్చిపోయింది. గుజరాత్ విజయాల్లో పాండ్యా కంటే కోచ్ ఆశిష్ నెహ్రా రోల్ ఎక్కువని గ్రహించలేకపోయింది. గుజరాత్ టీమ్‌ను బిల్డ్ చేయడంలో, విజయాలు సాధించడంలో నెహ్రా పాత్ర ఎంతో ఉంది. ఫ్రాంచైజీ కోసం అతడు చాలా కష్టపడ్డాడు. మ్యాచుల టైమ్‌లో డగౌట్లో, బౌండరీ లైన్ దగ్గర చాలా ఇంటెన్స్‌గా కనిపించేవాడు నెహ్రా.
ఎప్పటికప్పుడు హార్దిక్ పాండ్యాకు సలహాలు, సూచనలు అందించేవాడు నెహ్రా. ఒకరకంగా అతడే షాడో కెప్టెన్సీ చేశాడని కూడా అంటుంటారు. ఈ దృష్ట్యా కెప్టెన్సీలో హార్దిక్ తోపు అనుకొని ఎంఐ తప్పుచేసినట్లు కనిపిస్తోంది. తెచ్చుకుంటే తెచ్చుకున్నారు.. కానీ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సారథ్యంలో పాండ్యాను ఒక సీజన్ ఆడించాల్సింది. మారిన ముంబై ఎన్విరాన్మెంట్ను అర్థం చేసుకోవడానికి.. కెప్టెన్సీ స్కిల్స్, టిప్స్‌ను రోహిత్ నుంచి నేర్చుకునేందుకు అతడికి టైమ్ ఇవ్వాల్సింది. కానీ ఏదో మునిగిపోతున్నట్లు హడావుడిగా హిట్‌మ్యాన్‌ను తప్పించి హార్దిక్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం ఆ టీమ్ చేసిన బిగ్ మిస్టేక్ అనే చెప్పాలి. టీమిండియా తరఫున కొన్ని టీ20ల్లో కెప్టెన్సీ చేసిన హార్దిక్ అక్కడ తన మార్క్ చూపించలేకపోయాడు. కానీ ఐపీఎల్లో మాత్రం సరైన డెసిజన్స్ తీసుకుంటూ టీమ్‌ను లీడ్ చేశాడు. దీన్ని బట్టి గుజరాత్ విజయాల్లో పైకి హార్దిక్ ఫేస్ కనిపించినా వెనుక ఉన్న శక్తి నెహ్రా అని అర్థమవుతోంది. మరి.. హార్దిక్ విషయంలో ముంబై చేసిన మిస్టేక్ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Steve Smith: వీడియో: మ్యాచ్ మధ్యలో స్మిత్ పేపర్ క్యాచ్! మారుమోగిన స్టేడియం