iDreamPost
android-app
ios-app

పంత్‌కి KGF రేంజ్ ఎలివేషన్! రోహిత్ మాటలకి గూస్ బంప్స్ పక్కా!

  • Published Mar 06, 2024 | 5:52 PM Updated Updated Mar 07, 2024 | 7:22 PM

Rohit Sharma, Rishabh Pant: టీమిండియా పర్యటనలో వరుస పరాభవాలతో ఢీలా పడ్డ ఇంగ్లాండ్ టీమ్ కి, ఆ జట్టు స్టార్ ప్లేయర్ కి రోహిత్ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. రోహిత్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Rohit Sharma, Rishabh Pant: టీమిండియా పర్యటనలో వరుస పరాభవాలతో ఢీలా పడ్డ ఇంగ్లాండ్ టీమ్ కి, ఆ జట్టు స్టార్ ప్లేయర్ కి రోహిత్ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. రోహిత్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

  • Published Mar 06, 2024 | 5:52 PMUpdated Mar 07, 2024 | 7:22 PM
పంత్‌కి KGF రేంజ్ ఎలివేషన్! రోహిత్ మాటలకి గూస్ బంప్స్ పక్కా!

టెస్ట్ క్రికెట్ రోజురోజుకీ డేంజర్ లో పడటం ఖాయమని గత కొంతకాలంగా చర్చ నడుస్తూ వచ్చింది. ఇది నడుస్తున్న సమయంలోనే ఇంగ్లాండ్ బజ్ బాల్ అంటూ టెస్ట్ క్రికెట్ లో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఓపెనర్లు నుండి లాస్ట్ బ్యాటర్ వరకు అటాకింగ్ గేమ్ ఆడుతూ, ప్రత్యర్థి జట్టుపై ప్రెజర్ పెంచడం ఇక్కడ మెయిన్ ట్రిక్. ఈ విషయంలో ఇంగ్లాండ్ అప్రోచ్ ని విమర్శించిన వారు ఉన్నారు. మెచ్చుకున్న వారు ఉన్నారు. అలాగే కొన్ని అద్భుత విజయాలు వచ్చాయి. కొన్ని పరాజయాలు వచ్చాయి. కానీ.., టెస్ట్ మ్యాచ్ లకి మాత్రం కచ్చితంగా మంచి ఆదరణ వచ్చింది. దీంతో.. ఇంగ్లాండ్ తామేదో టెస్ట్ క్రికెట్ లో తోపులం అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోయింది. నిజానికి రిజల్ట్ మాత్రం వేరుగా ఉంది. ఇక ఇండియా సిరీస్ లో వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐదో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటోంది ఇంగ్లీష్ టీమ్.

వరుస పరాజయాల నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా నోరు జారుతూ వచ్చారు. కానీ.., టీమిండియా మాత్రం వారందరికీ ఆటతోనే సమాధానం ఇస్తూ వచ్చింది. అయితే.., తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మాత్రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్రిటీష్ టీమ్ పై పంచ్ లతో చెలరేగిపోయాడు. దీనికి కారణం ఆ జట్టు ఓపెనర్ బెన్ డకెట్ కామెంట్స్. మూడో టెస్ట్ లో ఇండియన్ ఓపెనర్ జైస్వాల్ డబుల్ సెంచరీతో వీరవిహారం చేసింది అందరికీ గుర్తుండే ఉంటుంది. డకెట్ ఆ మ్యాచ్ తరువాత జైస్వాల్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. కానీ.., జైస్వాల్ టెస్ట్ క్రికెట్ అంత ఫాస్ట్ గా ఆడటానికి తమ బజ్ బాల్ కాన్సెప్ట్ కారణమని, తమ అప్రోచ్ ఎంతో మందిలో మార్పు తీసుకొస్తుందని డకెట్ ఏవేవో కామెంట్స్ చేసి.., ఇంగ్లాండ్ క్రికెట్ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. ఇంగ్లాండ్ ఓపెనర్ చేసిన ఆ కామెంట్స్ కి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చి వారి నోరు మూయించాడు.

జైస్వాల్ బ్యాటింగ్ ని డకెట్ మెచ్చుకోవడం మంచి విషయమే. కానీ.., ఆ ఆటకి స్ఫూర్తి మాత్రం ఇంగ్లాండ్ జట్టు కాదు. అది అతని సహజ శైలి. నిజానికి ఇంగ్లాండ్ కి బజ్ బాల్ తెలియకముందే.. ఇండియా ఆ అప్రోచ్ తో ఆడి చాలా విజయాలను దక్కించుకుంది. డకెట్ కి ఇండియన్ లో టీమ్ రిషబ్ పంత్ గురించి తెలిసినట్టుగా లేదు. అతని ఆటలో ఎంత వేగం ఉంటదో తెలిసినట్టు లేదు. అని అంటూ వరుస పెట్టి సెటైర్స్ కురిపించాడు. ఇక్కడ రోహిత్ పరోక్షంగా గబ్బా టెస్ట్ లో పంత్ ఆట గురించి ప్రసంశించినట్టు అయ్యింది. మా దేశానికి, మా ఆటగాళ్లకి ఇంగ్లాండ్ నుండి స్ఫూర్తి పొండాల్సిన అవసరం లేదు. అలాంటి టాలెంట్ తమకి ముందు నుండి ఉంది అని చెప్పడం రోహిత్ ఉద్దేశం. అయితే.. ఈ సమయంలో కొంతమంది అభిమానులు ఇంగ్లాండ్ టీమ్ కి సెహ్వాగ్ బ్యాటింగ్ గురించి కూడా తెలుసుకోమని సలహాలు ఇస్తున్నారు. ఇక సెహ్వాగ్ ఆట ఎంత వేగంగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ విషయంలో రోహ్త్ కామెంట్స్ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.