iDreamPost

రోహిత్​ శర్మ మాటలు పట్టించుకోని జడేజా.. చెప్పినా వినకుండా..!

  • Author Soma Sekhar Published - 10:28 AM, Fri - 3 November 23

శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ-రవీంద్ర జడేజాల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ-రవీంద్ర జడేజాల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

  • Author Soma Sekhar Published - 10:28 AM, Fri - 3 November 23
రోహిత్​ శర్మ మాటలు పట్టించుకోని జడేజా.. చెప్పినా వినకుండా..!

వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా 302 పరుగుల తేడాతో శ్రీలంకపై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా అన్ని విభాగాల్లో సత్తాచాటి.. సమష్టి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మరీ ముఖ్యంగా భారత పేస్ త్రయం బుమ్రా, షమీ, సిరాజ్ లు నిప్పులు చెరిగే బంతులతో లంక బ్యాటర్లను అల్లాడించారు. ఇక ఈ మ్యాచ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు దండం పెట్టడం అయితే.. మరోటి రోహిత్ శర్మ-జడేజాల మధ్య జరిగిన ఇన్సిడెంట్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలేం జరిగిందంటే?

శ్రీలంకతో తాజాగా జరిగిన మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అదేంటంటే? భారత ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్​లో షమి, జడేజా ఆడుతున్నారు. ఆ సమయంలో ఆరుకు ఆరు బంతులు ఆడాలని డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న రోహిత్ జడేజాకు సూచించాడు. కానీ జడ్డూ మాత్రం కెప్టెన్ మాట పట్టించుకోలేదు. మొదటి బాల్ ​కు రెండు రన్స్ తీసి.. తర్వాతి బాల్ ​కు సింగిల్ తీసి షమీకి స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బాల్ షాట్ కొట్టబోయి మిస్సయ్యాడు షమి. కీపర్ చేతుల్లోకి బంతి వెళ్లడంతో జడ్డూ రన్ కు రావాల్సిందిగా షమీకి చెప్పాడు.

ఈ క్రమంలో రన్ ​కు ప్రయత్నించిన షమి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బుమ్రా సింగిల్ తీసి జడ్డూకు బ్యాటింగ్ ఇచ్చాడు. ఐదో బాల్ డాట్ కాగా.. ఆరో బాల్ ​కు రెండు రన్స్ తీసేందుకు ట్రై చేసి జడేజా రనౌట్. సో లాస్ట్ ఓవర్లో మొత్తంగా 5 రన్స్ వచ్చాయి. ఆరు బంతులు కూడా జడేజానే స్ట్రైకింగ్ తీసుకోమన్న రోహిత్ మాటలను పెడచెవిన పెట్టాడు రవీంద్ర జడేజా. దీంతో రోహిత్ అసహనం వ్యక్తం చేసినట్లుగా ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రోహిత్ చెప్పినట్లుగా జడేజా ఆడిఉంటే కనీసం రెండు సిక్సర్లు అయినా వచ్చి ఉండేవని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి