iDreamPost
android-app
ios-app

రోహిత్‌ కెప్టెన్‌గా ICC వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌! అంతా వరల్డ్‌ కప్‌ హీరోలే

  • Published Jan 23, 2024 | 1:50 PM Updated Updated Jan 23, 2024 | 1:50 PM

ఐసీసీ తాజాగా వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా నియమించిన ఐసీసీ.. చాలా మంది వరల్డ్‌కప్‌ హీరోలను జట్టులోకి తీసుకుంది. మరి ఆ టీమ్‌ గురించి ఇప్పుడు చూద్దాం..

ఐసీసీ తాజాగా వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా నియమించిన ఐసీసీ.. చాలా మంది వరల్డ్‌కప్‌ హీరోలను జట్టులోకి తీసుకుంది. మరి ఆ టీమ్‌ గురించి ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 23, 2024 | 1:50 PMUpdated Jan 23, 2024 | 1:50 PM
రోహిత్‌ కెప్టెన్‌గా ICC వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌! అంతా వరల్డ్‌ కప్‌ హీరోలే

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ తాజాగా వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ప్రస్తుత భారత జట్టు సారథి రోహత్‌ శర్మను నియమించింది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌లో జట్టును ఛాంపియన్‌గా నిలిపిన ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ను కాదని, రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా ప్రకటించడంపై భారత క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కప్పు గెలవడం ముఖ్యం కాదని, జట్టును నడిపించిన తీరు ముఖ్యమంటూ ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే.. వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా 11 మ్యాచ్‌లు ఆడితే.. ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ, ఆ ఓడిన ఒక్క మ్యాచ్‌ ఫైనల్‌ కావడం మన దురదృష్టం.

అయితే.. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో సగం మంది ఇండియన్‌ క్రికెటర్లే ఉన్నారు. ఈ జట్టులో భారత నుంచి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శుబ్‌మన్‌ గిల్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ షమీ ఉన్నారు. ఇలా 11 మంది ఉండే టీమ్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లే ఉండటంతో ఇది దాదాపు ఇండియన్‌ టీమ్‌లా ఉందని, ఐపీఎల్‌ టీమ్‌లా కూడా కనిపిస్తోందంటూ క్రికెట్‌ అభిమానులు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. అయితే.. ఈ టీమ్‌లో ఉన్న వాళ్లంతా వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అదరగొట్టిన వారే ఉండటం విశేషం.

Rohit as captain of ICC team

రోహిత్‌ శర్మ ఓపెనర్‌ కమ్‌ కెప్టెన్‌గా వరల్డ్‌ కప్‌లో అద్భుతంగా రాణించాడు. ఇక శుబ్‌మన్‌ గిల్‌ కూడా మంచి ప్రదర్శన కనవర్చాడు. విరాట్‌ కోహ్లీ తన కెరీర్‌ బెస్ట్‌ వరల్డ్‌ కప్‌ ఆడాడు. వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే తొలి సారి ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించి.. టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక కుల్దీప్‌, సిరాజ్‌ కూడా మంచి ప్రభావం చూపారు. షమీ అయితే.. వరల్డ్‌ కప్‌లో టీమిండియా హీరోగా అవతరించాడు. కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడి.. ఏకంగా 24 వికెట్లు పడగొట్టి.. టోర్నీలోనే టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. వీరితో పాటు.. వరల్డ్‌ కప్‌లో రాణించిన న్యూజిలాండ్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌, సౌతాఫ్రికా ఆటగాళ్లు క్లాసెన్‌, జాన్సెన్‌, ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా, ట్రావిస్‌ హెడ్‌ ఉన్నారు.

ఐసీసీ వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, ట్రావిస్‌ హెడ్‌, విరాట్‌ కోహ్లీ, డారిల్‌ మిచెల్‌, క్లాసెస్‌, జాన్సెన్‌, ఆడమ్ జంపా, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, షమీ.