టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే. హిట్‌మ్యాన్ బ్యాటింగ్, కెప్టెన్సీ అంటే చాలా మందికి ఇష్టం. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడే రోహిత్ బ్యాటింగ్‌ను చూసేందుకు కోట్లాది మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. గ్రౌండ్ లోపల ఒక్కోసారి అగ్రెసివ్‌గా, కొన్నిసార్లు కూల్‌గా కనిపిస్తాడు హిట్‌మ్యాన్. కానీ బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడు. తాను నవ్వుతూ, సహచర ప్లేయర్లను నవ్విస్తూ ఉంటాడు. రోహిత్లో ఫన్ యాంగిల్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ల సమయంలో అడిగే కొన్ని ప్రశ్నలకు హిట్‌మ్యాన్ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
తాజాగా మరోసారి అందర్నీ నవ్వించాడు రోహిత్ శర్మ. మరికొన్ని గంటల్లో ప్రతిష్టాత్మక వరల్డ్ కప్-2023 స్టార్ట్ అవనుంది. మెగా టోర్నీలో ఆడేందుకు అన్ని జట్లు భారత్‌కు వచ్చేశాయి. ఒక్క టీమిండియా తప్ప అన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌లు ఆడాయి. భారత్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే రోహిత్ సేన వరల్డ్ కప్‌కు వెళ్తోంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ కప్ ఆరంభం నేపథ్యంలో అన్ని జట్ల సారథులతో కలిపి కెప్టెన్స్ రౌండ్ టేబుల్ ఈవెంట్ నిర్వహించింది ఐసీసీ.
కెప్టెన్స్ రౌండ్ టేబుల్ ఈవెంట్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అయితే ఈ ఈవెంట్లో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒక జోక్ కూడా వేసి అందర్నీ నవ్వించాడు. ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టుల్లో ఒకరు హిట్‌మ్యాన్‌ను ఓ ప్రశ్న అడిగారు. గత వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్-ఇంగ్లండ్ మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో బౌండరీల కౌంట్ ద్వారా ఇంగ్లీష్ టీమ్‌ను విజేతగా నిర్ణయించారు. ఇదే విషయాన్ని రోహిత్‌కు గుర్తుచేసిన ఆ జర్నలిస్ట్.. ఇంగ్లండ్‌తో పాటు న్యూజిలాండ్‌ను కూడా కలిపి సంయుక్తంగా విన్నర్‌గా ప్రకటిస్తే బాగుండేదన్నారు.
ఇదే విషయంపై మీ అభిప్రాయం ఏంటని రోహిత్‌ను అడిగారు జర్నలిస్ట్. దీంతో ఇది తనకు వేయాల్సిన ప్రశ్నేనా అంటూ నవ్వాడు రోహిత్. విజేత ఎవరో నిర్ణయించడం, ప్రకటించడం తన చేతుల్లో లేని పని అని అంటూ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు. దీంతో అక్కడ ఉన్న కెప్టెన్లు సహా అందరూ నవ్వారు. ఈ సంభాషణ అంతా హిందీలో జరిగింది. రోహిత్ జోక్ అర్థం కాకపోయినా అందరూ నవ్వారు. అయితే హిందీ రాకపోయినా ఇంగ్లండ్ అనే పదం వినిపించడంతో అసలు ఏం జరిగిందో తనకు చెప్పమని, ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయాలని పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను జాస్ బట్లర్ కోరాడు. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న గురించి బట్లర్‌కు బాబర్ వివరించాడు. దీనికి బట్లర్ కూడా ఓకే అంటూ నవ్వేశాడు. పాక్ క్రికెటర్లకు హిందీ వచ్చుననే విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: KBCలో క్రికెట్‌పై రూ.25 లక్షల ప్రశ్న.. ఆన్సర్ క్రికెట్ లవర్స్‌కూ తెలియదు!
Jos Buttler asking for the translation to Babar Azam for Rohit Sharma’s joke in Hindi. pic.twitter.com/vZMl5bPcUS
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2023