iDreamPost

KBCలో క్రికెట్​పై రూ.25 లక్షల ప్రశ్న! ఆన్సర్‌ క్రికెట్‌ లవర్స్‌కూ తెలియదు!

  • Author singhj Updated - 12:01 PM, Fri - 3 November 23
  • Author singhj Updated - 12:01 PM, Fri - 3 November 23
KBCలో క్రికెట్​పై రూ.25 లక్షల ప్రశ్న! ఆన్సర్‌ క్రికెట్‌ లవర్స్‌కూ తెలియదు!

దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు అమితాబ్ బచ్చన్. ఆయన నటించే సినిమాలతో పాటు హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్​పతి (కేబీసీ) ప్రోగ్రామ్ కూడా బాగా పాపులర్ అనే విషయం తెలిసిందే. ఇండియన్ టెలివిజన్​లో బాగా ఫేమస్ అయిన షోల్లో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది. ఒక సమయంలో హిట్లు లేక పూర్తిగా డీలాపడ్డ అమితాబ్​లో ఈ షో మళ్లీ జోష్ నింపింది. కేబీసీ హిట్టవ్వడంతో పుంజుకున్న బిగ్​ బీ.. మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కేబీసీ మొదలై చాలా ఏళ్లు కావొస్తోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. తనను నిలబెట్టిన ఈ షో హోస్టింగ్​ను అమితాబ్ వదులుకోవట్లేదు.

కౌన్ బనేగా కరోడ్​పతి ప్రస్తుత సీజన్​లో చాలా మంది కంటెస్టెంట్లు అద్భుతంగా రాణిస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బుల్ని వాళ్లు గెలుచుకుంటున్నారు. ఇప్పటిదాకా రూ.కోటి నెగ్గిన కంటెస్టెంట్లు ఇద్దరున్నారు. వారిలో ఒకరు జస్కరన్ కాగా.. మరొకరు జస్నిల్. కేబీసీలో అడిగే క్వశ్చన్స్ ఏ రేంజ్​లో ఉంటాయో తెలిసిందే. వీటికి ఆన్సర్స్ చెప్పడం అంత ఈజీ కాదు. స్పోర్ట్స్, సినిమా, పాలిటిక్స్, లిటరసీ, సైన్స్, హిస్టరీ.. ఇలా చాలా విషయాలపై నాలెడ్జ్ ఉంటే తప్ప జవాబు చెప్పలేం. అంత డెప్త్​గా అమితాబ్ క్వశ్చన్స్ అడుగుతారు. తాజా ఎపిసోడ్​లో వర్షా సారోగి అనే కంటెస్టెంట్​ను ఇలాగే ఓ కఠినమైన ప్రశ్న అడిగారు.

వర్షా సారోగి అనే కంటెస్టెంట్​కు రూ.25 లక్షల ప్రశ్నగా క్రికెట్​కు సంబంధించిన క్వశ్చన్ అడిగారు బిగ్ బీ. కింది ఇంగ్లండ్ టీమ్ కెప్లెన్లలో ఎవరు భారత్​లో పుట్టలేదనేది ప్రశ్న. దీనికి డగ్లస్ జర్డైన్, కొలిన్ కౌడ్రే, నాసిర్ హుస్సేన్, టెడ్ డెక్స్​టర్​లు ఆప్షన్లుగా ఇచ్చారు. అయితే క్రికెట్​పై మంచి నాలెడ్జ్ ఉన్నవారు కూడా ఈ క్వశ్చన్​కు ఆన్సర్ చెప్పడం కష్టమే. ఎందుకంటే వారిలో నాసిర్ హుస్సేన్ తప్ప అంతా పాతతరం క్రికెటర్లే. వారి గురించి ఇప్పటివారికి అవగాహన ఉండే ఛాన్స్ లేదు. ఈ ప్రశ్నకు జవాబు తెలియదని.. తాను గేమ్ నుంచి వెళ్లిపోదల్చుకున్నానని కంటెస్టెంట్ వర్ష అన్నారు.

వర్ష రూ.12.5 లక్షల ప్రైజ్ మనీ తీసుకొని కేబీసీ నుంచి వెళ్లిపోయారు. ఇక, పై ప్రశ్నకు సరైన జవాబు టెడ్ డెక్స్​టర్. ఇటలీలోని మిలాన్​లో పుట్టిన ఆయన.. ఇంగ్లండ్ తరఫున 62 టెస్టులు ఆడారు. మిగిలిన ముగ్గురు ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్లలో నాసిర్ హుస్సేన్ చెన్నైలో జన్మించారు. డగ్లస్ జర్డైన్ ముంబై పాత బాంబేలో పుట్టారు. కొలిన్ కౌడ్రే తమిళనాడులోని ఊటీలో పుట్టారు. అయితే కేబీసీలో అడిగిన ఈ ప్రశ్నపై నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్వశ్చన్స్​కు గూగుల్ తప్ప ఎవరూ సమాధానం చెప్పలేరని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: కెప్టెన్స్ రౌండ్ టేబుల్ ఈవెంట్.. బవుమా చేసిన పనికి అంతా షాక్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి