Rohit Sharma: రోహిత్​పై యువీ షాకింగ్ కామెంట్స్.. గ్రేట్ కెప్టెనే కానీ..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై లెజెండరీ ప్లేయర్ యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడ్ని గ్రేట్ కెప్టెన్ అంటూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు యువీ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై లెజెండరీ ప్లేయర్ యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడ్ని గ్రేట్ కెప్టెన్ అంటూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు యువీ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి స్పెషల్​గా చెప్పాల్సిన పని లేదు. ఒక ఆటగాడి, సారథిగా సాధించిన విజయాలు, సృష్టించిన రికార్డులే అతడు ఏంటనేది చెబుతాయి. ఓపెనర్​గా ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ టీమిండియాకు సూపర్బ్ స్టార్ట్స్​ అందిస్తున్నాడు. హిట్​మ్యాన్ క్రీజులో సెటిల్ అయ్యాడా అవతలి జట్టు పనైపోయినట్లే. బ్యాట్ చేత పడితే అపోజిషన్ టీమ్ బౌలర్లను ఉతికి ఆరేసే రోహిత్.. కెప్టెన్సీలోనూ తనదైన మార్క్​ చూయిస్తున్నాడు. టీమిండియాను సక్సెస్​ఫుల్​గా నడిపిస్తూ అత్యుత్తమ సారథుల్లో ఒకడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా భారత్​కు అందివ్వలేదనే అపప్రద మాత్రం పోవట్లేదు. వరల్డ్ టెస్ట్ సిరీస్​తో పాటు వన్డే వరల్డ్ కప్​ ఫైనల్​కు టీమ్​కు చేర్చినా కప్పు కల మాత్రం తీర్చలేదు. దీంతో రోహిత్​ బెస్ట్ కెప్టెన్ కాదని కొందరు విమర్శకులు అంటున్నారు. తాజాగా ఈ విషయంపై లెజెండరీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు.

రోహిత్ శర్మ ముమ్మాటికీ గ్రేట్ కెప్టెన్ అని యువరాజ్ సింగ్ అన్నాడు. వరల్డ్ కప్​ ఫైనల్​లో టీమిండియా ఓడినా గానీ అతడు బెస్ట్ కెప్టెనే అని చెప్పాడు. అతడు ముంబై ఇండియన్స్​కు 5 ట్రోఫీలు అందించాడని తెలిపాడు. భారత జట్టును ప్రపంచ కప్​లో ఫైనల్స్​కు చేర్చాడన్నాడు. ఐపీఎల్​తో పాటు టీమిండియా క్రికెట్ హిస్టరీలో అత్యుత్తమ సారథుల్లో హిట్​మ్యాన్ ఒకడని యువరాజ్ మెచ్చుకున్నాడు. రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడని.. అయితే అతడి వర్క్ లోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నాడు. హిట్​మ్యాన్​కు పని భారం తగ్గించేందుకు ప్రయత్నించాలన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నారంటే వర్క్ లోడ్​ను మేనేజ్ చేయక తప్పదని పేర్కొన్నాడు యువీ. 14 నెలల గ్యాప్ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీ మళ్లీ టీ20ల్లోకి ఎంట్రీ ఇస్తుండటం శుభపరిణామమని తెలిపాడు.

స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం గురించి తనకేమీ తెలియదన్నాడు యువరాజ్. అతడి సిచ్యువేషన్ ఎలా ఉందో తనకు ఐడియా లేదన్నాడు. అతడి ఫిట్​నెస్​ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుందని చెప్పాడు. ముంబై ఇండియన్స్​కు హార్దిక్ ఆడినప్పుడు అతడి నుంచి బెస్ట్ గేమ్​ను రోహిత్ రాబట్టుకున్నాడని యువీ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా బౌలింగ్ వర్క్ లోడ్​ను హిట్​మ్యాన్ మేనేజ్ చేసే తీరు సూపర్ అని ప్రశంసించాడు. పాండ్యా బ్యాట్​తో అద్భుతంగా రాణిస్తాడని.. ఆఖర్లో వచ్చి ఫినిష్ చేయడం మంచి విషయమన్నాడు యువీ. ఏ టీమ్​లో అయినా ఆటగాళ్లు అందరూ కలసికట్టుగా ఆడితే ఇగో సమస్య ఉండదన్నాడు. మరి.. గ్రేటెస్ట్ కెప్టెన్లలో రోహిత్ ఒకడని యువరాజ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన డుప్లెసిప్.. ఈ ఏజ్​లో ఎలా పాజిబుల్ బ్రో!

Show comments