iDreamPost

FAF DU PLESSIS: వీడియో: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన డుప్లెసిప్.. ఈ ఏజ్​లో ఎలా పాజిబుల్ బ్రో!

  • Published Jan 13, 2024 | 9:05 PMUpdated Jan 13, 2024 | 9:05 PM

సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ టాలెంట్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. క్లాసిక్ షాట్స్​తో ఆకట్టుకునే ఈ బ్యాటర్.. అవసరాన్ని బట్టి గేర్ మార్చి విధ్వంసక షాట్లతోనూ విరుచుకుపడతాడు. ఫీల్డింగ్​లోనూ అతడు తోపే. దీనికి ఈ వీడియోనే బెస్ట్ ఎగ్జాంపుల్.

సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ టాలెంట్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. క్లాసిక్ షాట్స్​తో ఆకట్టుకునే ఈ బ్యాటర్.. అవసరాన్ని బట్టి గేర్ మార్చి విధ్వంసక షాట్లతోనూ విరుచుకుపడతాడు. ఫీల్డింగ్​లోనూ అతడు తోపే. దీనికి ఈ వీడియోనే బెస్ట్ ఎగ్జాంపుల్.

  • Published Jan 13, 2024 | 9:05 PMUpdated Jan 13, 2024 | 9:05 PM
FAF DU PLESSIS: వీడియో: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన డుప్లెసిప్.. ఈ ఏజ్​లో ఎలా పాజిబుల్ బ్రో!

క్రికెట్​లో రెండు రకాల బ్యాటర్లు ఉంటారు. కొందరు క్లాసిక్ షాట్స్​తో కూల్​గా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తుంటారు. మరికొందరు భారీ షాట్లతో, హార్డ్ హిట్టింగ్​తో ప్రత్యర్థులను భయపెడుతుంటారు. అయితే జెంటిల్మన్ గేమ్​లో ఇంకో రకం బ్యాటర్లు కూడా ఉన్నారు. వాళ్లే క్లాస్, మాస్ స్టైల్స్ కలిపి ఆడేవారు. అందులో ముందు వరుసలో ఉంటాడు ఫాఫ్ డుప్లెసిస్. ఈ సౌతాఫ్రికా స్టార్ గ్రౌండ్​లోకి దిగితే అపోజిషన్ టీమ్స్ వణికిపోతాయి. ఇన్నింగ్స్ స్టార్టింగ్​లో క్లాసిక్ షాట్స్​తో పరుగులు చేసే డుప్లెసిస్.. కాస్త కుదురుకున్నాడా ఇక అపోజిషన్ టీమ్ బౌలర్లకు చుక్కలే. గ్రౌండ్ షాట్స్ ఎంత బాగా ఆడతాడో అంతే బాగా భారీ సిక్సులు కొట్టడం అతడి స్పెషాలిటీ. నిల్చున్న చోటు నుంచే అలవోకగా బిగ్ సిక్సెస్ కొట్టడం డుప్లెసిస్​కు వెన్నతో పెట్టిన విద్య. అయితే బ్యాటింగే కాదు.. ఫీల్డింగ్​లోనూ అతడు దిట్టే. ఫీల్డింగ్​లో మరోమారు తన క్లాస్ చూపించాడతను.

సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎస్​ఏ టీ20 లీగ్​లోని ఓ మ్యాచ్​లో డుప్లెసిస్ అద్భుతమైన క్యాచ్​ పట్టుకున్నాడు. ముంబై కేప్​టౌన్, జోబర్గ్ సూపర్ కింగ్స్​కు మధ్య జరుగుతున్న మ్యాచ్​లో కళ్లు చెదిరే రీతిలో వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్​ను ఒడిసిపట్టాడు డుప్లెసిస్. డెవాల్డ్ బ్రేవిస్ (5) కొట్టిన షాట్​కు బాల్ పైకి లేచింది. దీంతో మిడాఫ్​లో ఉన్న డుప్లెసిస్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. బాల్​ను సమీపించినప్పటికీ అది కిందపడుతుండటంతో డైవ్ చేసి సింగిల్ హ్యాండ్​తో పట్టుకున్నాడు. దీంతో బ్యాటర్ బ్రేవిస్ సహా సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాకయ్యారు. ఈ క్యాచ్ ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు.. అలా ఎలా పట్టాడని ఆశ్చర్యపోతున్నారు. 39 ఏళ్ల ఏజ్​లో ఇలాంటి క్యాచ్ పట్టడం డుప్లెసిస్​కు తప్ప ఎవరికీ సాధ్యం కాదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, ఈ మ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్​కు దిగిన ఎంఐ కేప్​టౌన్ ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ వాండర్ డస్సెన్ (104) సెంచరీతో మెరిశాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (98) శతకానికి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్ ప్రస్తుతం 8.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఉంది. కళ్లు చెదిరే క్యాచ్​తో ఆకట్టుకున్న డుప్లెసిస్ బ్యాటింగ్​లో మాత్రం ఫెయిలయ్యాడు. కేవలం 6 పరుగులు చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. ఇక, ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి రీఎంట్రీపై ఇటీవల డుప్లెసిస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్​-2024లో తనకు ఆడాలని ఉందన్నాడు. అయితే ఈ విషయంలో సౌతాఫ్రికా బోర్డు తీసుకునే డెసిజన్ మీదే అంతా ఆధారపడి ఉంది. మరి.. డుప్లెసిస్ ఫెంటాస్టిక్ క్యాచ్​పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ విధ్వంసం.. ఇలాగే ఆడితే IPLలో బౌలర్లకు చుక్కలే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి