టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోనూ సహచరులను ఉత్సాహపరుస్తూ ఉంటాడు. మ్యాచ్ ఎలా గెలవాలి? ప్రత్యర్థులను ఎలా దెబ్బతీయాలనే దానిపై వ్యూహాలు పన్నుతూ ఉంటాడు. అలాంటి రోహిత్‌కు మతిమరుపు సమస్య ఉందని తెలుసా? అవును. ఈ విషయాన్ని అతడి సహచర ప్లేయర్ విరాట్ కోహ్లీ గతంలో ఒక సందర్భంలో వెల్లడించాడు. యూట్యూబర్ గౌరవ్ కపూర్ షోలో విరాట్ మాట్లాడుతూ.. రోహిత్‌కు మతిమరుపు ఎక్కువని చెప్పాడు. అతడు మర్చిపోయినన్ని వస్తువులు ఇంకెవరూ మర్చిపోరన్నాడు.
ఒక్కటని కాదు.. ఐఫోన్, ఐపాడ్, వాలెట్ లాంటివి చాలాసార్లు రోహిత్ మర్చిపోయాడని.. రెండు, మూడు సార్లయితే హోటల్ రూమ్‌లోనే తన పాస్‌పోర్ట్‌ను కూడా మర్చిపోయాడని తెలిపాడు. వీటిని వెతికి పట్టుకునేందుకు తమకు తలప్రాణం తోకకు వచ్చిందన్నాడు. చిన్నచిన్న వస్తువుల్ని రోహిత్ పట్టించుకోడని అన్నాడు. ఇటీవల ఆసియా కప్ సమయంలో కూడా లంక నుంచి భారత్‌కు తిరిగొస్తుండగా హిట్‌మ్యాన్ తన పాస్‌పోర్ట్ మర్చిపోయాడు. ఆ పాస్‌పోర్ట్‌ను టీమిండియా సపోర్ట్ స్టాఫ్ మెంబర్ ఒకరు వెతికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇప్పుడు రోహిత్ మరో వస్తువును పోగొట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆడిన ఆఖరి వన్డేలో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ పర్సనల్ ఐఫోన్ పోయిందట. ఇది దొంగతనానికి గురైందని సమాచారం. తరచూ వస్తువులు మర్చిపోయే అలవాటు ఉన్న హిట్‌మ్యాన్.. ఫోన్‌ను కూడా మర్చిపోయాడేమోనని కొందరు అంటున్నారు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న టైమ్‌లోనే అతడి మొబైల్ పోయిందట. అయితే దీన్ని లైట్ తీసుకున్న రోహిత్.. ఆసీస్‌పై తనదైన స్టైల్లో చెలరేగి బ్యాటింగ్ చేశాడు. అయినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు.
ఇదీ చదవండి: క్రికెట్లో అందాల దేవత.. హీరోయిన్లను మించిన అందం!
Virat Kohli in 2017 – I haven’t seen anyone forget things like Rohit Sharma does. He even forgets his iPad, passport.
Tonight – Rohit forgot his passport, and a support staff member gave it back to him. (Ankan Kar). pic.twitter.com/3nFsiJwCP4
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023