అలాంటి వారికే టీమ్ లో చోటు.. పాండ్యా, ఇషాన్ కు రోహిత్ ఇండైరెక్ట్ వార్నింగ్!

Rohit Sharma: ఇంగ్లండ్ పై టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇండైరెక్ట్ గా పాండ్యా, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లకు వార్నింగ్ ఇచ్చాడు.

Rohit Sharma: ఇంగ్లండ్ పై టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇండైరెక్ట్ గా పాండ్యా, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లకు వార్నింగ్ ఇచ్చాడు.

గత కొంతకాలంగా టీమిండియాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తీసేసి హార్దిక్ పాండ్యాకు అప్పగించడం, ఇషాన్ కిషన్ మానసిక ఒత్తిడితో రెస్ట్ కావాలని కోరిన విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కూడా ఇషాన్ టీమిండియాతో కలవలేదు. ఇటు గాయం నుంచి కోరుకున్న పాండ్యా సైతం డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా ఐపీఎల్ సన్నాహకాల్లో పాల్గొన్నారు. దీంతో బీసీసీఐ సీరియస్ అయ్యింది. అయితే ఇంగ్లండ్ పై టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన రోహిత్ ఇండైరెక్ట్ గా పాండ్యా, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లకు వార్నింగ్ ఇచ్చాడు.

విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్లు లేకపోయినప్పటికీ.. ఇంగ్లండ్ పై టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకుంది టీమిండియా. యంగ్ ప్లేయర్లను సమర్థవంతంగా ఉపయోగించుకుని ఇంగ్లండ్ ను ఘోరంగా దెబ్బతీశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. యశస్వీ జైస్వాల్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాళ్లకు స్వేచ్ఛను ఇచ్చి.. వారి నుంచి పరుగులు రాబట్టుకున్నాడు. అయితే ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్ శర్మ.. కుర్రాళ్ళపై ప్రశంసలు కురిపించాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ ప్రెస్ మీట్ లో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు.

రోహిత్ శర్మ మాట్లాడుతూ..”టీమిండియా విజయాల కోసం ఎవరైతే కష్టపడతారో.. వారికి తగిన గుర్తింపు ఉంటుంది. అంతే తప్ప వచ్చి పోయే వారికి, చెప్పినట్లు వినని వారికి జట్టులో చోటు ఉండదు. ఆటపై ఇష్టం, ప్రేమ, తపన ఉన్న ప్లేయర్లకు కచ్చితంగా భవిష్యత్ ఉంటుంది. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. కఠిన పరిస్థితుల్లో ఆడుతూ.. వెళ్తున్న యంగ్ ప్లేయర్లను ఎప్పుడూ నోటిఫై చేస్తుంటాం. ఇక ఐపీఎల్ అద్భుతమైన ఫార్మాటే కాదనను. అయితే కొందరు అదే లోకం అనుకుంటూ ఉన్నారు. టీమిండియా కోసం ఎవరైతే అన్ని పరిస్థితుల్లో ఆడటానికి సిద్ధంగా ఉంటారో.. వారికే జట్టులో గుర్తింపు, చోటు ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ భాయ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

దీంతో రోహిత్ చేసిన కామెంట్స్ ఇండైరెక్ట్ గా హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ గురించే అని నెటిజన్లు భావిస్తున్నారు. గత కొంత కాలంగా వీరు ముగ్గురు టీమిండియాకు దూరంగా ఉండటమే కాకుండా.. డొమెస్టిక్ క్రికెట్ లో కూడా ఆడలేదు. దీంతో బీసీసీఐ సీరియస్ అయ్యింది. బీసీసీఐ ఇచ్చిన వార్నింగ్ తో ఎట్టకేలకు దిగొచ్చిన వీరు డీవై పాటిల్ టోర్నీలో ఆడటానికి సిద్దపడ్డారు. ఇప్పటికే పాండ్యా ఈ టోర్నీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇషాన్, శ్రేయస్ కూడా త్వరలోనే డీవై పాటిల్ టోర్నీలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముంబై కెప్టెన్ గా రోహిత్ ను తీసేసి హార్దిక్ అప్పగించడంపై రోహిత్ తో పాటుగా ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. మరి రోహిత్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ఆ ముగ్గురి గురించేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: RCBకి బిగ్ షాక్.. కోహ్లీ IPL ఆడటం కష్టమే: సునీల్ గవాస్కర్

Show comments