iDreamPost

RCBకి బిగ్ షాక్.. కోహ్లీ IPL ఆడటం కష్టమే: సునీల్ గవాస్కర్

ఐపీఎల్ 2024లో విరాట్ ఆడతాడా? ప్రస్తుతం ఈ ప్రశ్న కోహ్లీ అభిమానులతో పాటుగా సగటు క్రికెట్ ఫ్యాన్స్ లో మెుదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్.

ఐపీఎల్ 2024లో విరాట్ ఆడతాడా? ప్రస్తుతం ఈ ప్రశ్న కోహ్లీ అభిమానులతో పాటుగా సగటు క్రికెట్ ఫ్యాన్స్ లో మెుదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్.

RCBకి బిగ్ షాక్.. కోహ్లీ IPL ఆడటం కష్టమే: సునీల్ గవాస్కర్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఇటీవలే రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందిన విరాట్.. ఆ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. అందుకే టీమిండియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి న్యూస్ లో వైరల్ గా మారాడు కింగ్ కోహ్లీ. ఐపీఎల్ 2024లో విరాట్ ఆడతాడా? ప్రస్తుతం ఈ ప్రశ్న కోహ్లీ అభిమానులతో పాటుగా సగటు క్రికెట్ ఫ్యాన్స్ లో మెుదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. తాజాగా ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్. విరాట్ ఐపీఎల్ 2024లో ఆడటం కష్టమే అని గవాస్కర్ బాంబ్ పేల్చాడు.

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీలో తొలి మ్యాచ్ చెన్నైసూపర్ కింగ్స్ తో తలపడనుంది ఆర్సీబీ. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ పాల్గొంటాడా? లేడా? అన్న డౌట్ అందరిలో నెలకొంది. ఇక ఇప్పుడు ఈ విషయంపై బాంబ్ పేల్చే కామెంట్స్ చేశాడు భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్. విరుష్క దంపతులకు పండంటి మగ బిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. దీంతో కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ఓ మీడియా ఛానల్ తో సునీల్ గవాస్కర్ ఈ విషయంపై మాట్లాడుతూ..”కోహ్లీ ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో టీమిండియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో అతడు ఐపీఎల్ ఆడతాడా? అన్న ప్రశ్న అందరిలో ఉంది. అయితే నాకు తెలిసినంత వరకు విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ లో ఆడకపోవచ్చు” అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఏంటి బ్రో అంత మాటన్నావ్ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ న్యూస్ విని కోహ్లీ ఫ్యాన్స్ తో పాటుగా ఆర్సీబీ అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు. అలా జరగకూడదని దేవున్ని ప్రార్థిస్తున్నారు. చూడాలి మరి విరాట్ ఈ ఐపీఎల్ లో ఆడతాడో? లేడో?

ఇదికూడా చదవండి: ఆస్పత్రి బెడ్ పై మహ్మద్ షమీ.. అసలేం జరిగింది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి