iDreamPost
android-app
ios-app

Yashasvi Jaiswal: నా సక్సెస్‌కు కారణం అతనే! ఆ ఒక్క మాటతోనే..: యశస్వీ జైస్వాల్

  • Published Jan 15, 2024 | 12:01 PM Updated Updated Jan 15, 2024 | 12:01 PM

ఆఫ్గానిస్తాన్ తో మ్యాచ్ అనంతరం తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు జైస్వాల్. ఆ స్టార్ ప్లేయర్ చెప్పిన ఒకే ఒక్క మాటతోనే ఈ సూపర్ ఇన్నింగ్స్ ఆడానని తెలిపాడు. మరి జైస్వాల్ సక్సెస్ కారణం ఎవరు? ఆ వివరాలు..

ఆఫ్గానిస్తాన్ తో మ్యాచ్ అనంతరం తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు జైస్వాల్. ఆ స్టార్ ప్లేయర్ చెప్పిన ఒకే ఒక్క మాటతోనే ఈ సూపర్ ఇన్నింగ్స్ ఆడానని తెలిపాడు. మరి జైస్వాల్ సక్సెస్ కారణం ఎవరు? ఆ వివరాలు..

Yashasvi Jaiswal: నా సక్సెస్‌కు కారణం అతనే! ఆ ఒక్క మాటతోనే..: యశస్వీ జైస్వాల్

టీమిండియా క్రికెట్ లోకి ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లు దూసుకొస్తున్నారు. అందులో ఒకడు యశస్వీ జైస్వాల్. సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. రాణిస్తున్నాడు ఈ 22 ఏళ్ల కుర్రాడు. ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లోనూ తనదైన దూకుడు ప్రదర్శించాడు. ఇక అదే జోరును ప్రస్తుతం ఆఫ్గానిస్తాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో చూపించాడు. తొలి మ్యాచ్ లో అవకాశం ఇవ్వకపోవడంతో.. రెండో మ్యాచ్ లో కసితో రెచ్చిపోయాడు ఈ కుర్ర ప్లేయర్. ధనాధన్ ఇన్నింగ్స్ తో 68 పరుగులు చేసి టీమిండియా సిరీస్ గెలవడంతో.. కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ అనంతరం తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు. ఆతడు చెప్పిన ఒకే ఒక్క మాటతోనే ఈ సూపర్ ఇన్నింగ్స్ ఆడానని తెలిపాడు. మరి జైస్వాల్ సక్సెస్ కారణం ఎవరు? తెలుసుకుందాం.

యశస్వీ జైస్వాల్.. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్లలో ఒకడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఆఫ్గానిస్తాన్ తో ఇండోర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్లతో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్ లో 34 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. తొలుత కోహ్లీతో, ఆ తర్వాత శివమ్ దూబేతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు జైస్వాల్. ఇక గత కొంతకాలంగా అద్బుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. తన సెక్సెస్ కు కారణం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పుకొచ్చాడు ఈ యువ ఆటగాడు.

కాగా.. మ్యాచ్ అనంతరం యశస్వీ జైస్వాల్ మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ నాకు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవాడు. అదేంటంటే? నువ్వు ఎలాగైతే నీ న్యాచురల్ గేమ్ ఆడుతావో.. అలాగే ఆడు. అంటూ నాకు ఫ్రీడమ్ ఇచ్చేవాడు. రోహిత్ భాయ్ చెప్పిన ఈ ఒక్కమాటను నేను ఫాలో అవుతూ వస్తున్నాను” అంటూ తన సక్సెస్ కు కారణం చెప్పుకొచ్చాడు యశస్వీ జైస్వాల్. ఇదిలా ఉండగా.. యశస్వీ జైస్వాల్ అద్భుతమైన ఆటగాడని ప్రశంసలు కురిపించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మరి రోహిత్ ఇచ్చిన ఫ్రీడమ్ తోనే తాను ఇలా సక్సెస్ అవుతున్నానని చెప్పిన జైస్వాల్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.