iDreamPost
android-app
ios-app

Rohit-Dhoni: దిగ్గజ కెప్టెన్‌ ధోనిని వెనక్కి నెట్టిన రోహిత్‌! ఇది మామూలు రికార్డు కాదు

  • Published Jan 15, 2024 | 1:00 PM Updated Updated Jan 15, 2024 | 1:00 PM

ఆఫ్గానిస్తాన్ తో జరిగిన రెండు టీ20ల్లో దారుణంగా విఫలం అయ్యాడు రోహిత్ శర్మ. కానీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ధోనిని వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించాడు.

ఆఫ్గానిస్తాన్ తో జరిగిన రెండు టీ20ల్లో దారుణంగా విఫలం అయ్యాడు రోహిత్ శర్మ. కానీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ధోనిని వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించాడు.

Rohit-Dhoni: దిగ్గజ కెప్టెన్‌ ధోనిని వెనక్కి నెట్టిన రోహిత్‌! ఇది మామూలు రికార్డు కాదు

రోహిత్ శర్మ.. దాదాపు 14 నెలల తర్వాత టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ మ్యాన్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించారు అభిమానులు. కానీ వారి ఆశలను నిరాశ చేస్తూ.. ఆఫ్గాన్ తో జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ డకౌట్ గా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్ లో దురదృష్టవశాత్తు రనౌట్ కాగా.. రెండో మ్యాచ్ లో ఫారూఖీ వేసిన అద్భుత బాల్ కు బౌల్డ్ అయ్యాడు రోహిత్. అయితే రెండు మ్యాచ్ ల్లో విఫలం అయినప్పటికీ.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని వెనక్కి నెట్టాడు. దీంతో నెం.1 కెప్టెన్ గా నిలిచాడు.

ఆఫ్గానిస్తాన్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. అదేంటి.. రెండు మ్యాచ్ ల్లోనూ డకౌట్ అయ్యాడుగా, మరి ఏ రికార్డులు సాధించాడు? అన్న అనుమానం మీకు రావొచ్చు. ఇప్పటికే అత్యధికంగా అంతర్జాతీయ టీ20లు ఆడిన తొలి ప్లేయర్ గా నిలిచిన రోహిత్.. 100 టీ20ల్లో విజయం సాధించిన ప్లేయర్ గా కూడా ఘనత సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు రికార్డులే కాకుండా.. మరో సరికొత్త చరిత్ర సృష్టించాడు హిట్ మ్యాన్. ఈసారి ఏకంగా భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన పురుషుల కెప్టెన్ గా నిలిచాడు రోహిత్ శర్మ. ఆఫ్గాన్ తో జరిగిన రెండో మ్యాచ్ లో సాధించిన విజయంతో ఈ ఘనతకెక్కాడు హిట్ మ్యాన్. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని 72 టీ20ల్లో 41 విజయాలు జట్టుకు అందించగా.. రోహిత్ శర్మ కేవలం 53 మ్యాచ్ ల్లోనే 41 గెలుపులను భారత్ కు అందించాడు. దీంతో ధోని కంటే తక్కువ మ్యాచ్ ల్లోనే అతడు ఈ రికార్డు నెలకొల్పాడు. దీంతో ఇది మామూలు రికార్డు కాదంటూ.. ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హిట్ మ్యాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే కాకుండా.. టీమిండియా తరఫున అత్యధిక టీ20 సిరీస్ లు గెలిచిన కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. మరి రోహిత్ నెలకొల్పిన ఈ అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.