Somesekhar
ఆఫ్గానిస్తాన్ తో జరిగిన రెండో టీ20లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.
ఆఫ్గానిస్తాన్ తో జరిగిన రెండో టీ20లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.
Somesekhar
ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆఫ్గానిస్తాన్ తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లో సత్తాచాటారు. ఇక ఈ మ్యాచ్ లో ప్రపంచ టీ20 క్రికెటర్ చరిత్రలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. 14 నెలల పాటు టీ20లకు దూరంగా ఉన్న ఇండియన్ స్కిప్పర్.. ఆఫ్గాన్ తో జరిగిన తొలి టీ20 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. జట్టులోకి వస్తూనే 100 టీ20 విజయాలు అందించిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్.
ఆఫ్గానిస్తాన్ తో జరిగిన రెండో టీ20 ఆడటం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్రను సృష్టించాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు హిట్ మ్యాన్. టీ20 ఫార్మాట్ అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు రోహిత్ శర్మ. అతడు ఈ పొట్టి ఫార్మాట్ లో 150 మ్యాచ్ లు ఆడాడు. దీంతో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన ఒకే ఒక్క ప్లేయర్ గా నిలిచాడు హిట్ మ్యాన్. రోహిత్ తర్వాత ఐర్లాండ్ ప్లేయర్లు పాల్ స్టిర్లింగ్ 134 మ్యాచ్ లు, జార్జ్ డాక్రెల్ 128, షోయబ్ మాలిక్ 124, మార్టిన్ గప్తిల్ 122 మ్యాచ్ లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో గుల్బాదిన్ నైబ్ 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లకే ఛేదించింది టీమిండియా. యశస్వీ జైస్వాల్ 68, శివమ్ దూబె 63 నాటౌట్ తో జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించారు. మరోసారి డకౌట్ వెనుదిరిగి రోహిత్ శర్మ ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశపరిచాడు. మరి హిట్ మ్యాన్ టీ20 చరిత్రలో 150 మ్యాచ్ లు ఆడిన ఏకైక క్రికెటర్ గా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Players who played most T20I in Cricket history.
– Rohit Sharma ( 150 match)
– Paul Stirling (134 match)
– George Dockrell (128 match)#Rohit pic.twitter.com/9cWJ4CeTgE— Amit Patel (@PatelCricinfo) January 12, 2024